మెగాస్టార్ కి జోడిగా నయనతార నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా నయనతారని ఒప్పించారు డైరెక్టర్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. గెస్ట్ పాత్రలో వెంకటేష్ నటించడం ఈ సినిమాకి మరింత ప్లస్ గా మారనుంది. ఈ ట్రైలర్ ఈవెంట్ తిరుపతిలో జరగగా, ఈ ట్రైలర్ ఈవెంట్లో డైరెక్టర్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ మెగా ఫ్యాన్స్ సైతం రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు అంటూ పెద్ద గోల చేశారు. దీంతో అందుకు సమాధానంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. రామ్ చరణ్ గారు ఒకరోజు ముందే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ ని చూపించానని చెప్పారు.
ఆ ట్రైలర్ చూసి రామ్ చరణ్ గారు నవ్వుకున్నారు. ఖచ్చితంగా రామ్ చరణ్ తో సినిమా చేస్తానని కానీ మీరు మన శంకర వరప్రసాద్ గారు సినిమాను బ్లాక్ బాస్టర్ చేయండి.. ఆ తర్వాతే నేను రామ్ చరణ్ దగ్గరకు వెళ్తానంటూ చెప్పారు అనిల్ రావిపూడి. దీంతో ప్రస్తుతం డైరెక్టర్ చేసిన ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో బహిరంగ మారుతున్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరో కొద్దిరోజులు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి