దేశ ప్రజల చూపు మొత్తం బీహార్ ఎన్నికలపైనే పడింది. అక్కడ గెలుపు ఎవరిదా అని అందరు ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో బీహార్ లో ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని రాహుల్ గాంధీ పూర్తిగా బీహార్ రాష్ట్రానికే పరిమితమై సభలు, సమావేశాలు పెడుతూ అక్కడే ఉంటున్నారు. ఇదే క్రమంలో బీహార్ లో బిజెపి గెలుపు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, కీలక నాయకులంతా బీహార్ లో తిష్ట వేశారు.ఇలా ఎవరికి వారే గెలుపు ఆలోచనలో ఉన్న ఈ తరుణంలో తాజాగా కొన్ని సర్వేలు బయటకు వచ్చాయి.. మరి ఆ సర్వేల ప్రకారం బిహార్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. 

ఎలక్షన్స్ వస్తున్నాయంటే సర్వే సంస్థలు మార్మోగిపోతాయి. తాజాగా ముందస్తు పోల్స్ చెప్పిన ప్రకారం బిహార్ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. మొన్నటికి మొన్న సీ ఓటర్ వారు కూడా బిజెపి అధికారంలోకి వస్తుందని తెలియజేసింది.  ప్రస్తుతం టైమ్స్ నౌ, జేబీసీ కలిపి చేసినటువంటి ఈ సర్వేలో ఎన్డీఏకు 141 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కూటమికి  92 సీట్లు వస్తాయని తెలియజేసింది. జేఎస్పీ పార్టీకి ఐదు సీట్లు వస్తాయని అన్నది. ఆగస్టులో కాంగ్రెస్ కు కాస్త బలం ఉండేది కానీ సెప్టెంబర్ కు వచ్చేసరికి ఇది కాస్త డౌన్ అవుతూ వచ్చింది.

ముఖ్యంగా బిజెపికి మహిళా రోజ్ గర్ యోజన అనేది గేమ్ చేంజర్ గా మారబోతోందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ  బీహార్ లో సర్వేలు మొత్తం ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి. మరి చూడాలి ఈ సర్వేలు నిజమవుతాయా లేదంటే ఆంధ్రప్రదేశ్ లో లాగా రిజల్ట్ తారు మారు అవుతుందా? ఏపీలో కూడా జగన్ గెలుస్తాడని చాలా వరకు సర్వేలు చెప్పాయి. కానీ చివరికి అక్కడ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ విధంగానే బీహార్ లో కూడా ఇలా జరుగుతుందా అనేది ముందు ముందు చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: