
ఎన్డీఏ కూటమిలో (JDU -BJP), జితన్ రామ్ మాంఝికి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చా (HAM) , ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలో రాష్ట్రీయ లోక్సమత పార్టీ (RLM),అలాగే చిరాగ్ పాసవాన్ ఆధ్వర్యంలో లోక్ జనశక్తి పార్టీ (LJP) కలవు. విశ్వసినీయ వర్గాల సమాచారం ప్రకారం.. LJP కి బిజెపి 25 సీట్లు ఆఫర్ చేసింది. HAM కు 7 సీట్లు, RLM కి 6 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఆ దిశగానే పాసవాన్ తో చర్చలు కూడా జరుగుతున్నట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈయన వాటాకు వెళ్లే స్థానాల సంఖ్య పెరిగినట్లు అయితే .. మాంఝి, కుశ్వాహా కేటాయించిన సీట్ల సంఖ్య పై కోతపడే అవకాశం ఉంటుంది.ఇలాంటిదే జరిగితే.. వారికి రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లను ఆఫర్ చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
నవంబర్ 6,11 తేదీల్లో రెండు విడతలుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. అదే నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపును పూర్తి చేసి ఫలితాలను ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా జేడీయూ పార్టీ నుంచి నితీష్ కుమార్ ఉన్నారు. తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు ఎన్డీఏ కూటమి,ఎన్నికల కోడ్ గత సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం బీహార్ యొక్క అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీ ముగియనుంది. అక్కడ కులాల వారీగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ తో పాటుగా, నిరుద్యోగం, వలసల ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం కూడా ఎన్నికల అంశంగా ఉండబోతోంది. NDA, RJD నేతృత్వంలో మహాఘట్ బంధన్, ఇండియా కూటమి మధ్య హోరాహోరీగా పోరు సాగే అవకాశం ఉంటుంది.