తేజస్వి మాట్లాడుతూ, “మన బీహార్ రాష్ట్రం పేద రాష్ట్రం అని నేను బీహారి గా బాధపడుతున్నాను. 20 ఏళ్లుగా ఎన్డీఏ పాలనలో రాష్ట్రం వెనుకబడి పోయింది. కేంద్రంలో 11 ఏళ్లుగా కూడా వారే అధికారంలో ఉన్నా, రాష్ట్ర తలసరి ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉంది. రైతులు ఇంకా పేదలుగానే ఉన్నారు. నిరుద్యోగం, అవినీతి, నీరసమైన పరిపాలన — ఇవన్నీ బీహార్‌ను వెనక్కి లాగుతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక బీహార్ ప్రజల కోసం తన పార్టీ అమలు చేయబోయే పథకాల జాబితాను కూడా ఆయన వివరించారు. పేదల కోసం కొత్త గృహ పథకాలు, రైతులకు ఉచిత విద్యుత్, వృద్ధులకు నెలకు రూ.1500 పెన్షన్, యువతకు ఉద్యోగావకాశాల కల్పన, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు — ఇవన్నీ తేజస్వి ఇచ్చిన ప్రధాన హామీలుగా నిలిచాయి.
తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, “ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే, నితీష్ కుమార్ సీఎం కాలేరు. ఆ కూటమిలో అంతర్గత కలహాలు, అవినీతి బహిరంగ రహస్యాలుగా మారాయి. బీహార్ ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు” అని బల్లగుద్ది చెప్పారు.తేజస్వి ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. “గ్యాస్ సిలిండర్ రూ.500కే?” అనే ట్యాగ్ లైన్ ఇప్పుడు బీహార్ పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండ్ అవుతోంది. కొంతమంది ఆయన హామీలను స్వాగతిస్తుండగా, మరికొందరు అవి సాధ్యం కాని వాగ్దానాలంటూ విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ తేజస్వి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారు రోగిపోతోంది.
ఇలా బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఒకవైపు ఎన్డీఏ అభివృద్ధి పేరుతో ప్రచారం చేస్తుంటే, మరోవైపు ఇండియా కూటమి ప్రజల మద్దతు కోసం కొత్త హామీలతో రంగంలోకి దిగింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే —“బీహార్ ప్రజలు ఎవరికి తీర్పు ఇస్తారు?”అది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి