ఏ ప్రాంతంలో అయినా సరే ఎన్నికలంటే కేవలం రాజకీయాలు ఒక్కటే కాదు. రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా కీలకంగా ఉంటాయి. అలా ఇప్పుడు బీహార్ ఎన్నికలలో అటు అధికార ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. బీహార్ ఎన్నికలలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా భారీ హామీలను ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళల్ని ,నిరుద్యోగులను ,యువతను టార్గెట్ చేస్తూ తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి.


గతంలో ఎన్నడూ లేని విధంగా బీహార్ ప్రజల పైన వరాలు కురిపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. బీహార్ లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీవికా దిది కమ్యూనిటీ ద్వారా మొబిలైజర్లకు ప్రతి నెల రూ.30 వేల చొప్పున వేతనం ఇస్తామంటూ తేజస్వి యాదవ్ ప్రకటించారు. అలాగే వారి తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయడంతో పాటు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామట్టు వెల్లడించారు. అలాగే 5 లక్షల వరకు బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తామంటే తెలిపారు.

ఇండియా కూటమి ఇచ్చిన అతిపెద్ద హామీలలో ఏమిటంటే ఉద్యోగాల క్రమబద్ధీకరణ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటూ తెలిపారు. అలాగే మహిళా సంక్షేమం, సాధికారత కోసం భేటీ మా అనేటువంటి ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తామంటూ తెలిపారు. దీని ద్వారా ఇల్లు, ఆహారం ,ఆదాయం అందిస్తామని తెలియజేస్తున్నారు. అలాగే రెండేళ్ల దాకా వడ్డీ మాఫీ చేస్తామని తెలిపారు. ఈ బీసీ వర్గాలకు జనాభా నిష్పత్తికి అనుగుణంగానే 50 శాతం వరకు పెంచుతామంటూ తెలిపారు. ఆర్జెడి ,కాంగ్రెస్ కూటమి మాత్రం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ హామీ ఇచ్చారు తేజస్వి యాదవ్.


NDA కూటమి హామీలు:
జెడియూ, బిజెపి కలిసున్న ఈ కూటమిలో భారీ హామీలను ప్రకటించారు. ఇప్పటికే నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనసాగించడంతోపాటుగా గ్రామీణ సంక్షేమ ఉద్యోగాలకు డిఏతో పాటుగా స్టేషనరీ జీతాలను కూడా పెంచుతామంటూ. 20 నుంచి 25 ఏళ్ళు వయసు కలిగిన నిరుద్యోగులకు ప్రతినెల రూ .1000 రూపాయలు అందిస్తామని, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకించి ప్రకటించింది ఎన్డీఏ కూటమి. వితంతు పెన్షన్ ని 400 నుంచి 1400 కు పెంచుతామని, పదవీ విరమణ చేసిన 95,000 మంది ఆశా వర్కర్లకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తామని తెలిపారు. ఇలా ఇవే కాకుండా మరెన్నో హామీలు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. అయితే వీటి ఖర్చు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంద అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. బీహార్ ఎన్నికలలో మహిళా ఓటర్లు చాలా కీలకం. ఇందులో మూడున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు. మరి కొన్ని రోజులలో  బీహార్  ఎన్నికలు జరగబోతున్నాయి ఫలితాలు నవంబర్ 14న రాబోతున్నాయి దీంతో బీహార్ మహిళలు ఎవరు పక్క ఉండి ఎన్నికలలో ఎవరిని గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: