ఐసీసీ మహిళ ప్రపంచ కప్ గెలిచి భారత్ మహిళా క్రికెట్ జట్టు ఒక సరి కొత్త చరిత్రను సృష్టించింది. దీంతో బీసీసీఐ కూడా కాసుల వర్షం ఆ మహిళా జట్టుకు కురిపించింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఉమెన్ ఇన్ బ్లూ జట్టుకు రూ. 51 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా. నవి ముంబై వేదికగా దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నిన్నటి రోజున భారత్ మహిళ జట్టు 52 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.


దీంతో మొదటిసారిగా ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన సందర్భంగా మహిళా జట్టుకు సైతం ఈ భారీ నజరానను ప్రకటించింది బీసీసీఐ. ఈ రూ .51 కోట్ల రివార్డులో ఆటగాళ్లు, కోచ్ సహాయక సిబ్బంది అందరూ కూడా భాగస్వామ్యులుగా ఉంటారట. ఈ భారీ బహుమతిని ప్రకటించడం వల్ల అటు పురుషులు, మహిళ క్రికెటర్లకు సైతం సమాన గౌరవ వేతనం అందిస్తున్నామనే విధంగా మరో బలాన్ని చేకూర్చినట్లు అవుతుందంటూ బీసీసీఐ తెలియజేసింది. గతంలో పురుషుల T- 20 ప్రపంచ కప్ విజేతలకు ఇచ్చినటువంటి ప్రోత్సాహాలకు సమానంగా లేదా వాటికంటే మరింత ఎక్కువ బహుమతిని ఇవ్వాలని బోర్డ్ భావించినట్లుగా సమాచారం.


అలాగే ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం కేవలం ట్రోఫీ మాత్రమే కాదని, దేశంలో తదుపరితరం మహిళా క్రికెటర్లకు కూడా ఇది ప్రేరణగా నిలుస్తుందని, దేశంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందంటూ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలియజేశారు. టీమ్ ఇండియా సాధించినటువంటి ఈ విజయం భారత క్రీడా చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందంటూ తెలిపారు. ఇక భారత మహిళా జట్టుకు కూడా ప్రధాన మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనల్ మ్యాచ్లో ఆడిన ఆట వారి యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రతిక అంటూ తెలియజేశారు. మన బిడ్డలు దేశాన్ని గర్వపడేలా చేశారంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: