గ్రేటర్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మరో వారం రోజుల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం బరిలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల్లోనూ గెలుపుపై తీవ్రమైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరికి వారు గెలుపు గుర్రంపై ధీమా వ్యక్తం చేస్తున్నా అంతర్గత చర్చల్లో మాత్రం ప్రత్యర్థుల ఎత్తులపై చర్చలు వేస్తున్నారు. వారి కంటే మనం బాగా ప్రచారం చేస్తున్నామా ఎక్కడెక్కడ ? ముందు ఉన్నాం ఏ ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నాం అనేదానిపై రకరకాల సర్వేలు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారాన్ని భేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోని బిఆర్ఎస్ - కాంగ్రెస్ వర్గాలు సర్వేలను ఆధారం చేసుకుని గెలుపు తమది అంటూ ప్రచారం చేసుకోవడం ఒక అంశం అయితే .. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఆధారంగా ఆయా పార్టీలు తమ నాయకులకు పదవులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉండటం విశేషం.
కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవులు ఆశించిన వారు .. నామినేటెడ్ పదవులు ఆశించిన వారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఆ పార్టీని గెలిపించేందుకు గట్టిగా కష్టపడుతున్నారు. ఇక బిఆర్ఎస్ లోను ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. పార్టీ పదవుల కోసం ఆశలు పెట్టుకున్న వారు ... వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారు కేసీఆర్ దగ్గర మంచి మార్కుల కోసం .. కేటీఆర్ దగ్గర మంచి మార్కుల కోసం గట్టిగా కష్టపడుతున్నారు. ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీరిలో ఎవరి ఆశలు నెరవేరుతాయో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి