టిడిపిలో కొందరు అతిబ్యాచ్ మొదలైంది. పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేస్తున్నారు ? పాలన ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారు ? పార్టీని ఎలా నడపాలో సూక్తులు చెబుతున్నారు ? చంద్రబాబు ఏం పాటించాలో కూడా చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి ప్రవచనాలు ఇస్తున్నారు. ప్రభుత్వం పైన పార్టీ పైన చివరకు పార్టీని తామే గెలిపించామని అతి చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపుకు చాలా కారణాలు ఉన్నాయి. చాలామంది కార్యకర్తలు కష్టపడ్డారు.. టిడిపిని తానే గెలిపించినట్టుగా చెప్పుకునే ఓ ప్రవచన కారుడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అదే పనిగా పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఈ ప్రవచన కారుడుతో పాటు ఓ మాజీ ఐపీఎస్ మరికొందరు కూడా ఇదే పని చేస్తుంటారు. వారి ఎజెండా ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది.
వీరికి సరైన ప్రాధాన్యం దక్కటం లేదనో .. లేదా ఆశించిన విధంగా నెత్తిన పెట్టుకోలేదని అసంతృప్తి ఉందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. టిడిపికి కోట్ల మంది సైనికులు ఉన్నారు. తాము కష్టపడి పనిచేసామని అనుకుంటారు. వీరిలో 90 శాతం మంది ఎలాంటి ప్రతిఫలం ఆశించరు .. కనీసం సలహాలు కూడా ఇవ్వాలని అనుకోరు. చంద్రబాబు - లోకేష్ కు అన్నీ తెలుసు అని నమ్ముతారు. మిగిలిన వారిలో కొందరు ఇలా తమ ఆశించిన ప్రతిఫలం దక్కలేదని ప్రభుత్వాన్ని పార్టీని విమర్శించే పనిలో మునిగిపోతారు. ఇక ఇటీవల కాలంలో టీడీపీ లోనే ఉంటూ ఈ అతి బ్యాచ్ చేసే హంగామా ఎక్కువుగా కనిపిస్తోంది. ఇలాంటి వాళ్లు పార్టీ ముసుగులో ఉండి చేసే పనులకు .. పెట్టే పోస్టులకు అనవసరంగా ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్లవుతుందని.. వీళ్లను కంట్రోల్ చేయాలన్న చర్చలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి