జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కొనుగోలు మొదలైంది. ప్రచార పర్వం ముగియక ముందే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లకు డబ్బుల పంపిణీ ప్రారంభించేశారు. ఓ ప్రధాన పార్టీ ఇప్పటికే ఒక్క ఓటుకు రు. 3 వేలు పంపిణీ చేస్తోంది. మొన్నటి వరకు ఓటుకు రు. 2 వేలు ఇస్తామని మరో ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్‌చార్జ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు అటు వైపు పార్టీ ఓటుకు రు. 3 వేలు పంచుతుండడంతో వీళ్లు కూడా వెయ్యి పెంచి ఓటుకు రు. 3 వేలు పంచుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం పంపిణీకి శ్రీకారం చుడతాయి. కానీ ఈ సారి మాత్రం ముందుగానే మొదలు పెట్టేశారు.
ఎన్నికల ప్రచారం ముగిశాక డబ్బు పంపిణీకి అడ్డంకులు వస్తాయనే ఆలోచనతో ముందుగానే రాజకీయ పార్టీలు అప్రమత్త మైనట్టు తెలుస్తోంది. ఓ వైపు పోలీసుల తనిఖీలు .. ఇటు ఎన్నికల స్క్వాడ్ ల తనిఖీల తో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతల ఇళ్లల్లో సైతం సోదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రచారం సాగుతుండగానే డబ్బు పంపిణీ ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు. ఇందుకోసం బూత్‌ల వారీగా ఇప్పటికే కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో స్థానిక కార్యకర్తల తో పాటు జిల్లాల నుంచి వచ్చినవారు సమన్వయం చేసేలా ఇన్‌చార్జులను కూడా నియమించారు. అపార్ట్‌మెంట్లలో, ఇళ్లలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. బూత్ కమిటీలతో కలిసి ఆయా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రచారం మరింత హీటెక్కింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి