( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

గ్రేటర్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. బిఆర్ఎస్ - కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ అనుకున్నా చివరకు అందరిని తలకిందులు చేస్తూ నవీన్ యాదవ్ ఏకంగా 25 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న విజయం సాధించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిపినకు అధిష్టానం ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పూర్తి నమ్మకాన్ని ఉంచింది. అందుకే అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం తెరవెనక వ్యూహాలు అన్ని రేవంత్ రెడ్డి క‌ను స‌న్న‌ల లోనే నడిచాయి. స్థానికంగా మంచిపట్టున్న రేసుగుర్రం నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వటం కలిసి వచ్చింది.


నవీన్ యాదవ్ స్థానికుడు , బీసీ నేత .. గతంలో ఓడిపోయిన స్థానికంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. అలాగే స్టార్ క్యాంపెనర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష కు పైగా మైనార్టీ ఓటర్లు ఉన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన భారత మాజీ స్టార్ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో అప్పటి వరకు భారతీయ రాష్ట్ర సమితివైపు ఏకపక్షంగా ముగ్గు చూపిన మైనార్టీలలో కొందరు మారారు.


అలాగే నియోజకవర్గంలో మంచి ఓటు బ్యాంకు ఉన్న ఎంఐఎం ను కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా చేసుకుంది. అలాగే గల్లీలలో మంత్రులందరూ పర్యటించారు. బస్తీలలో అభివృద్ధి మంత్రం పఠించారు. డివిజన్లో వారిగా మంత్రులకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సక్సెస్ అయింది. ఈ కారణాలతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగే లేని విజయం సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: