అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేశారు. బకాయిల చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులలో సేవలు కూడా ఆగిపోయాయని.. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రశ్నించడంతో రూ.1800 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిగిలిన రూ.3,500 కోట్లు పెండింగ్ ఉండడంతో ఆసుపత్రి వాళ్లు నిధులు విడుదల చేయాలని బంద్ చేశారని తెలిపారు. పేదలకు అవసరమైన ఆరోగ్యశ్రీ అంటే ఏపీలో భద్రత లేని పరిస్థితిగా మారిపోయిందని.. 104,108 కనీసం రూ .500 కోట్లు నెట్వర్ట్ లేని సంస్థకు ఇచ్చారు. అది కూడా టిడిపి డాక్టర్ సేల్స్ అధ్యక్షుడీకే అంటూ ఫైర్ అయ్యారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కూడా ఒక స్కామే.. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్లకు ఒక బోనంజ ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు.మెడికల్ కళాశాలలు ప్రైవేట్ కరణం అయిన తర్వాత అందులో పని చేసే వారికి జీతాలు మాత్రం ప్రభుత్వం ఇస్తుందని.. ప్రభుత్వ భూమి, బిల్డింగులు, స్టాఫ్ జీతాలు అన్ని ప్రభుత్వమే కానీ ఓనర్లు మాత్రం ప్రైవేటు వాళ్లే లాభాలు కూడా ప్రైవేటు వాళ్లకే , ఈ స్కాము పై ఒక అడుగు ముందుకు వేసి చేస్తున్నారు.. ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ప్రజలు కూడా ఆందోళన చేపడుతున్నారు. ప్రైవేటీకరణం ఆపాలని కోటి సంతకాల సేకరణ చేసాము. ఈనెల 10 అన్ని జిల్లాలో ఉండే అన్ని కేంద్రాలకు పంపించి 13న అన్ని జిల్లాలలో ర్యాలీలు చేసి సెంట్రల్ ఆఫీస్ కి పంపేలా చేస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 16న గవర్నర్ కి చెప్పటం , ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తామంటూ హెచ్చరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి