అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డల్లాస్‌లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. "ప్రవాసాంధ్రులు మా కుటుంబానికి కొండంత బలం!" అంటూ వేలాది మంది తెలుగు ప్రజల మధ్య లోకేష్ చేసిన భావోద్వేగ ప్రకటన సభలో ఉత్సాహాన్ని నింపింది. కష్టకాలంలో నిలిచిన 'NRI' లు .. గత ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో అరెస్ట్ చేసిన అత్యంత క్లిష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు అండగా నిలిచారని లోకేష్ గుర్తుచేశారు. ఆ క్లిష్టమైన సమయంలో పార్టీకి, కుటుంబానికి ధైర్యం ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐలను ఆయన "Most Reliable indians (MRIs)"  గా అభివర్ణించడం వారి త్యాగాన్ని గౌరవించినట్లైంది.


ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ... 'వై నాట్ 175' అంటూ ఊదరగొట్టిన వారికి ప్రజలు  'వై నాట్ 11' తో షాక్ ఇచ్చారని, కూటమికి 164 సీట్లు దక్కడంలో ప్రవాసాంధ్రుల పాత్ర మరవలేనిదని లోకేష్ ప్రశంసించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో తిరిగి పట్టాలెక్కించి, ఆంధ్రప్రదేశ్ వేగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం .. కూటమి ప్రభుత్వం యువత కోసం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని లోకేష్ గంభీరంగా ప్రకటించారు. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి, తామే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని లోకేష్ ఆకాంక్షించారు. అలాగే, విదేశాల్లోని తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా APNRT అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.



రెడ్ బుక్ ఉందంటే ఉందంతే! .. చివరగా లోకేష్ చేసిన 'రెడ్ బుక్' వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. "రెడ్ బుక్ ఉందంటే ఉందంతే! తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఏపీలో అరాచక పాలన చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు" అంటూ లోకేష్ చేసిన హెచ్చరికలు ప్రతిపక్ష వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. ప్రవాసాంధ్రులను కొండంత బలమని చెబుతూనే, విపక్ష నేతలకు గట్టి వార్నింగ్ ఇస్తూ లోకేష్ డల్లాస్ సభను విజయవంతంగా ముగించారు. ఈ పర్యటన ద్వారా లోకేష్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: