ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.మల్లారెడ్డి మనవడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కించారని కవిత పేర్కొన్నారు. అందుకే రేవంత్ ప్రభుత్వం మల్లారెడ్డి జోలికి వెళ్లడం లేదని ఆమె సెటైర్ వేశారు. లక్ష్మాపూర్ ప్రాంతాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు వాడుకున్నారని, కానీ అక్కడి సమస్యలు మాత్రం తీరలేదని ఆమె ఆరోపించారు. మేడ్చల్ జిల్లాలో ఆరడగుల బుల్లెట్ అని పిలుచుకునే నాయకుడు కనీసం ఒక్క ఆసుపత్రి కూడా కట్టించలేదని కవిత విమర్శించారు. మేడ్చల్‌కు వెళ్లి చూస్తే అక్కడ అభివృద్ధి ఎంత జరిగిందో తెలుస్తుందని ఆమె సవాల్ విసిరారు.
మూడు కోట్ల మందికి పైగా జనాభా ఉన్న మేడ్చల్‌లో నూరు పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేదని ఆమె ఎత్తిచూపారు.విద్య, ఆరోగ్య రంగాలను పూర్తిగా ప్రైవేట్ చేశారని కవిత ఆరోపణలు చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు కబ్జా కోరు అనే పేరు ఉందని, అక్కడి భూములపై కన్ను వేశారని ఆమె వ్యాఖ్యానించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే కబ్జాలు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతాల్లో నిజమైన అభివృద్ధి జరగలేదని, కేవలం వ్యక్తిగత లాభాల కోసమే నాయకులు పనిచేశారని కవిత ధ్వజమెత్తారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి