ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి నాలుగు నెలలు కూడా కాలేదు, కానీ నెల్లూరు నగర రాజకీయాలు మాత్రం నడిబజార్‌లో నాటకీయతకు తెరలేపాయి. కేవలం కొన్ని నెలల పదవీకాలం ఉన్న నెల్లూరు మేయర్ పీఠం కోసం అధికార కూటమి (టీడీపీ) మరియు విపక్ష వైసీపీల మధ్య భీకరమైన రాజకీయ యుద్ధం మొదలైంది! ఈ పోరుకు కారణం... పీఠం దక్కించుకోవడం రాజకీయ ప్రతిష్టగా ఇరుపక్షాలు భావించడమే.


మారిన సీన్... అవిశ్వాసానికి సిద్ధం! :
2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 53 కార్పొరేటర్లలో ఒక్క సీటు కూడా విపక్షానికి దక్కకుండా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, 2024 ఎన్నికల ఫలితాలు ఈ సమీకరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎన్నికల అనంతరం దాదాపు 40 మంది వైసీపీ కార్పొరేటర్లు విడతలవారీగా అధికార కూటమిలో (టీడీపీ) చేరిపోయారు. దీంతో వైసీపీ బలం 13కు పడిపోయింది.



ప్రస్తుతం మేయర్‌గా ఉన్న స్రవంతి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (అప్పట్లో వైసీపీ) అనుచరురాలు అయినప్పటికీ, ఆమె కూటమి అధికారంలోకి రాగానే అటువైపు మొగ్గు చూపారు. అందుకే ఇప్పుడు నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా తన మనిషిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే మేయర్ మీద అవిశ్వాసం ప్రతిపాదించారు. ఈ అవిశ్వాసంపై ఓటింగ్ ఈ నెల 18న జరగనుంది.



అనిల్ కుమార్ యాదవ్ 'రీ-ఎంట్రీస‌! :
మేయర్ పీఠం టీడీపీకి దక్కకుండా అడ్డుకోవడానికి మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. ఆయన చొరవతో టీడీపీలోకి వెళ్లిన కార్పొరేటర్లలో ఐదుగురు తిరిగి వైసీపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ బలం మళ్లీ 18కి పెరిగింది. మరికొందరిని తమవైపు తిప్పుకోగలిగితే అవిశ్వాసాన్ని తిప్పికొట్టవచ్చని, కార్పొరేషన్‌పై వైసీపీ పట్టును నిలబెట్టుకోవచ్చని కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.



మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తమ వైపు ఉన్న కార్పొరేటర్లతో క్యాంపు రాజకీయాలకు తెర తీశారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తన హవా కొనసాగించడానికి నెల్లూరు మేయర్ పీఠం కీలకంగా మారుతుందని ఆయన భావిస్తున్నారు. మొత్తంగా, నెల్లూరు రాజకీయాల్లో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య జరుగుతున్న 'నువ్వా-నేనా' పోరు, ఈ నెల 18న జరిగే అవిశ్వాస ఓటింగ్‌ను ఒక సంచలన రాజకీయ ఘట్టంగా మార్చబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: