జగిత్యాల జిల్లాలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి వెళ్లి స్వామివారిని చాలాసార్లు దర్శించేవారు పవన్ కళ్యాణ్. అలాగే మొక్కులు కూడా చెల్లించేవారు. అయితే ఇప్పుడు ఆ దేవాలయానికి ఏకంగా రూ .30 కోట్ల రూపాయలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మంజూరు చేయించినట్లుగా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన సెంటిమెంట్ అని చెప్పవచ్చు.
తన రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు ఈ ఆలయాన్ని సందర్శించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో కూడా అక్కడ ఆలయానికి వచ్చి మరి పూజలు చేసిన సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జనసేన పార్టీ ప్రారంభంలో కూడా పూజలు చేయించి ఆంజనేయ స్వామి ఆశీస్సులను తీసుకొని మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి వాహనానికి ఆలయంలో పూజలు చేయించి మొదలుపెట్టారు. ఇక ఏపీలో కూటమిలో భాగంగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని ఆలయ అభివృద్ధి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు డిప్యూటీ సీఎం. ముఖ్యంగా అక్కడ భక్తులకు వసతి సౌకర్యం, గదులు, దీక్ష మండపం వంటివి నిర్మించడానికి తాజాగా రూ.30 కోట్ల రూపాయలు ttd నిధులనుంచి వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి