ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఎక్కువగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లలో వాట్సప్ యాప్ కూడా ఒకటి. అయితే వీటిని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉచితంగానే వినియోగిస్తున్నారు. వాట్సప్ కూడా ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఇప్పుడు అడుగులు వేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఉచితంగానే సేవలందించిన వాట్సప్ త్వరలోనే సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే వాట్సప్ నుంచి ప్రకటనలు,పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫిచర్ ని కూడా తీసుకురాబోతున్నట్లు నిపుణులు సైతం గుర్తించారు.



వాట్సప్ తన స్టేటస్ ఫీచర్ విషయంలో కొన్ని మార్పులు చేయబోతోంది.. ఎవరైతే వాట్సప్ కు రుసుమ చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి స్టేటస్ లు చూసే సమయంలో ఎటువంటి యాడ్స్ కనిపించవు. కానీ సబ్‌స్క్రిప్షన్ తీసుకొని వారికి, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ద్వారా ఎలా యాడ్స్ వస్తాయో అలాగే వాట్సాప్ స్టేటస్ మధ్యలో యాడ్స్ కనిపిస్తాయట. మెసేజెస్ పంపించడం, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ వంటివి చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదని తెలుస్తోంది. కేవలం స్టేటస్ ట్యాబ్ లో మాత్రమే ఈ మార్పులు తీసుకువచ్చేలా రూపొందిస్తున్నారు. అయితే ఈ విషయం పైన ఇంకా వాట్సాప్ నుంచి ఎటువంటి అధికారికంగా ప్రకటన వెలబడలేదు.



ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ కోడింగ్ లో మాత్రమే కనిపిస్తోందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెటా సంస్థ (ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్) వంటి వాటిలలో సబ్‌స్క్రిప్షన్ పద్ధతి తీసుకురావడం వల్ల మధ్యలో యాడ్స్ కనిపించవు. త్వరలోనే వాట్సాప్ లో కూడా ఇదే పద్ధతిని అమలులోకి తీసుకువచ్చేలా చూస్తోంది వాట్సాప్. బిజినెస్ చేసేవారు ఎక్కువగా తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఈ ప్రకటనలను ఉపయోగించుకోవచ్చని, అలా ఇప్పటికే ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ యాడ్స్ నేరుగా వాట్సాప్ లో కూడా కనిపించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అలా ప్రకటన రూపంలో ఆదాయాన్ని అర్జించాలని వాట్సప్ చూస్తోంది. ఒకవేళ యాడ్స్ వద్దనుకుంటే.. డబ్బులు చెల్లించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: