నందమూరి తారకరత్న..ఈ పేరుని జనాలు మరిచిపోయినప్పటికీ ఇంట్లో వాళ్ళు మాత్రం మర్చిపోరు.ఎందుకంటే బంధం అలాంటిది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మాత్రం పదేపదే తన భర్తను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది.అయితే భర్త చనిపోయిన చాలా రోజులకి అలేఖ్య రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలన్నింటిని బయటపెట్టింది. మరి ఇంతకీ తారకరత్న భార్యని అవమానించింది ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అలేఖ్య రెడ్డి ది లవ్ మ్యారేజ్. అయితే అలేఖ్య రెడ్డికి అప్పటికే పెళ్ళై విడాకులు అయ్యాయి. అయినా కానీ తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ పెళ్లి అలేఖ్య రెడ్డి పేరెంట్స్ కి ఇష్టమే అయినప్పటికీ తారకరత్న పేరెంట్స్ మాత్రం ఒప్పుకోలేదు. ఇద్దరినీ ఇంట్లోకి కూడా రానివ్వలేదు.ఈ కోపం ఎంతలా అంటే తారక రత్న చనిపోయినా కూడా చివరి వరకు ఆయన్ని చూడడానికి కూడా రాలేదు. 

చనిపోయాక చివరి చూపుకి వచ్చారు.అలాగే తారకరత్న చనిపోయాడు కాబట్టి కోడలు మనవడు మనవరాళ్లని తారకరత్న తండ్రి చేరదీసి ఇంటికి తీసుకువెళ్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు వారిని నందమూరి ఫ్యామిలీ దగ్గరికి తీయలేదు. కేవలం బాలకృష్ణ, ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లు తప్ప మిగిలిన వారు వీరితో మాట్లాడడం లేదని తెలుస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ.. హాస్పిటల్లో ఉన్న సమయంలో ఎన్నో దేవుళ్లకు మొక్కాను. కానీ ఫలితం లేదు.ఆ సమయంలో బాలా బాబాయ్, మా చిన్నాన్న, అమ్మానాన్నలు తోడుగా ఉన్నారు. నా పిల్లల్ని చెల్లెలు, అన్నయ్య చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఎన్ని దేవుళ్లకు మొక్కినా ఫలితం లేకుండా పోయింది. డాక్టర్ సారీ చెప్పడంతో నా గుండె పగిలిపోయింది. ఇక మా అమ్మ నాన్నలకి తారకరత్న చాలా క్లోజ్.. ఆయన మరణ వార్త విని వాళ్లు కుప్పకూలిపోయారు. 7,8 నెలల వరకు మేము ఆ షాక్ నుండి బయట పడలేకపోయాం. ఇక ఇప్పటివరకు అత్తయ్య మామయ్యల గురించి మాట్లాడే టైం రాలేదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడే టైం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.

నేను వారిని అత్తమామలుగా యాక్సెప్ట్ చేశాను. కానీ నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు.చివరి వరకు వెయిట్ చేస్తాం.వాళ్ళు మమ్మల్ని చేరదీస్తారని అనుకుంటున్నాం. ఇక తారకరత్న చనిపోయాక నన్ను ఓ ఫంక్షన్ కి పిలిచారు.ఆ సమయంలో నేను కుంకుమ ముట్టుకుంటే నువ్వు కుంకుమ ముట్టుకోకూడదు పెట్టుకోకూడదు.నువ్వు హారతి ఇవ్వకూడదు అంటూ అవమానించారు.. ఆ సమయంలో చాలా బాధనిపించింది.నేను తారకరత్న ఉన్నప్పుడు ఎలా అయితే పూజలు చేశానో ఇప్పుడు అలాగే పూజలు చేస్తున్నాను. కుంకుమ పెట్టుకోవద్దు హారతి ఇవ్వకూడదు అని ఏమైనా రాజ్యాంగంలో రాసారా.. ఎందుకు ఇలాంటి కట్టుబాట్లు పెడతారు.అలాంటప్పుడు ఫంక్షన్లకు పిలవకూడదు. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను ఇలా అవమానించలేదు. అలా డిఫరెన్సెస్ చూపించరు.కానీ ఆరోజు మాత్రం నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నుండి ఏ ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకోవడం లేదు.ఒకవేళ వాళ్ళు పిలిచినా నన్ను పిలవకండి అవమానించకండి అని ముందే చెబుతున్నాను అంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: