ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన పోలవరం టెండర్ల వ్యవహారంపై మంగళవారం కీలక నిర్ణయం వెలువడనుంది. మొదట ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీ సమర్పించిన అనుభవపత్రాలు నకిలీవని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... ప్రతాలను పరిశీలించాలని విదేశాంగ శాఖను కోరింది. దీంతో ప్రభుత్వానికి మతిపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. రష్యా అనుభంద సంస్ద సమర్పించిన అనుభవ పత్రాలు వాస్తవం కాదని ఆదారాలతో ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే రాజకీయ లబ్ది చేకూర్చే క్రమంలో ఎంపి రాయపాటి అధిష్టానం పెద్దల నుంచి ఒత్తిడి చేయించారు. ఇప్పటికే సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన హైపవర్ కమిటి సమావేశమై... తుది నిర్ణయం తీసుకోనుంది. దాదాపు ఎంపీ రాయపాటి కంపెనీ ట్రాన్స్ స్ట్రాయ్ కే టెండర్లు ఖరారు చేయాలని ప్రభుత్వం దాదాపు సిద్ధమైంది. అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని ప్రచారం జరుగుతోంది. అయితే పోలవరం టెండర్ల వ్యవహారం ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. టెండర్లను రద్దు చేసి మరోసారి టెండర్లను పిలిస్తే ... ప్రభుత్వం పరవుపోవటమే కాకుండా... ఆర్థిక భారం తప్పదనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ టెండర్లు రాయపాటి కంపెనీకి కేటాయిస్తే న్యాయ పరమైన చిక్కులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరువు కోసం అలోచిస్తుందా లేక రాజకీయ అవసరాలే ప్రధానంగా ముందుకు వెళుతుందా అన్నది ఇవాళ తేలిపోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: