హైదరాబాద్: ‘ఆమె ముప్పయి యేళ్లకు పైగా రాజకీయాలను చూస్తున్నారు. ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు’. కానీ, ఆమె ప్రసంగాలు ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది. సూటిపోటి మాటలతో రాజకీయ ఉద్దండులను సైతం మట్టికరిపించింది. ఆమె మాట్లాడుతున్న తీరు అందర్ని ఆశ్చర్యపరిచే విధంగా వుంటోంది. ఆమె సభలకు ప్రజలు ఎగబడుతున్నారు. ఆమెను చూడటానికి తండోపతండలుగా తరలివస్తున్నారు. ఒంటిచేత్తో 15మంది ఎమ్మెల్యేలను, ఓ పార్లమెంటు సభ్యుణ్ణి గెలిపించిన ధీరవనిత. ఓ వైపు పార్టీని నడిపిస్తూనే...మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. పుట్టెడు దు:ఖాన్ని గుండెల్లో దిగమింగుకుంటూ నిన్న కడపలో రైతు సమస్యలపై, నేడు విజయవాడలో కరంటు కోతలపై, రేపు సిరిసిల్లలో చేనేత కార్మికుల సమస్యలపై పోరుకు సై అంటోంది. ఆమెనే వైఎస్. విజయలక్ష్మి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భార్యగా విజయమ్మ యావత్ రాష్ర్టప్రజానీకానికి తెలుసు. కానీ, విధిలేని పరిస్థితుల్లో విజయమ్మ రాజకీయ అరంగేట్రం చేసిన విషయం విధితమే. ఓ వైపు భర్తను పోగొట్టుకుని, మరోవైపు కొడుకు జైలుకు వెళ్లడంతో గుండెలనిండ బాధల్ని గుండెల్లోనే దాచుకుని విజయమ్మ అనునిత్యం ప్రజల్లోనే ఉంటోంది. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతో బిజీబిజీగా ఉంటోంది. అనూహ్యామైన పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె ఏ ఒక్కరోజు ఇంటికి పరిమితమైన దాఖలాలు లేవు. విశ్రాంతి తీసుకున్నదీ లేదు. ఎప్పుడూ రాష్ర్ట ప్రజల బాధల్ని తన బాధలుగా భావించి ఆమె అలుపెరుగని పోరాటం చేస్తోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజల తరుపున ఆమె పోరుసలుపుతోంది.  రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని విభేదిస్తున్నప్పటికీ రాష్ర్ట రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానిని కలిసి వినతి పత్రం అందచేసిన ఘనత ఆమెది. తన కుటుంబానికి అన్యాయం చేసినా, రైతాంగానికైనా న్యాయం చేయండంటూ ఢిల్లీ పెద్దలందర్ని కోరారంటే రాష్ర్ట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విజయమ్మ ఎంతగా తపనపడుతుందో అర్థం చేసుకోవచ్చు. జూన్ లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారం ముగియగానే కడపకు వెళ్లింది. విశాఖ స్టీల్ ప్లాంటులో జరిగిన ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో జరిగిన దళితుల ఊచకోత బాధితులను పరామర్శించడానికి వెళ్లింది. అక్కడి నుంచి పులివెందులలో ప్రజాదర్భార్ను నిర్వహించింది. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి పార్టీ శాసనసభా పక్షం సమావేశంలో పాల్గొన్నారు.  తరుచూ ప్రజా సమస్యలపై ఏదో ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటూనే ఉన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ నిన్న కడప జిల్లాలో ‘మహాధర్నా’చేపట్టింది. తాజాగా నేడు విజయవాడలో కరంటు కోతలను నిరసిస్తూ మరో నిరసన కార్యక్రమాన్ని విజయమ్మ చేపట్టుతోంది. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రాష్ర్ట ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ నిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ ధర్నాలను చేపట్టింది. దీనిలో భాగంగానే విజయమ్మ విజయవాడలో ధర్నాకు దిగుతున్నారు. మరో ఐదారు రోజుల్లో సిరిసిల్లలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒకరోజు దీక్షకు దిగనున్నారు.  మొత్తానికి జగన్ చేపట్టిన కార్యక్రమాల మాదిరిగానే విజయమ్మ ముందుకు సాగుతున్నారు. జగన్ జైలుకు వెళ్లకముందు పార్టీ స్థాపించినప్పటి నుంచి రెండేళ్లకు పైగా ప్రజల మధ్యన ఉన్నారు. జలదీక్ష, ఫీజురియంబర్స్ మెంటు, రైతు దీక్ష, చేనేత దీక్ష వంటి అనేక దీక్షలు చేపట్టారు. ఇప్పుడు జగన్ బాటలోనే ఆయన తల్లి విజయమ్మ పయనిస్తోంది. రైతు సమస్యలపై, మహాధర్నాలు, ధర్నాలు, చేనేత కార్మికులపై దీక్షలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి విజయమ్మ చేస్తున్న ఆందోళనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె ఆందోనలతో అందర్ని ఆకట్టుకుంటోంది. ఇంతటి బాధలో కూడా ప్రజా సమస్యలపై పోరు చేయడమనేది నిజంగా అభినందించదగ్గ విషయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: