అదరదు బెదరదు-పీసీసీ చీఫ్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు భయపడదనీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడిన వారిని సోనియాగాంధీ సహించదన్నారు. అవినీతికి పాల్పడిన వారు చివరకు ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న వారినైనా వదలబోమన్నారు. జగన్ విషయంలో కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ విజయమ్మ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడబోమన్నారు. అవినీతి విషయంలో ఒక జగన్ను మాత్రమే విచారించడం లేదనీ, తమ పార్టీకి చెందిన మంత్రి మోపిదేవిని కూడా సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందన్నారు. వైఎస్ మరణంపై అనుమానాలుంటే విజయమ్మ నివ్రుత్తి చేసుకోవచ్చన్నారు. దీనిపై రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు లేఖ కూడా రాశానని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో తనను కూడా సీబీఐ విచారించిందని గుర్తు చేశారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లిన ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: