మగవాళ్లకు కిక్కు ఎక్కిస్తే వచ్చే డబ్బులు సరిపోవడం లేదేమో. మహిళలకు కూడా మందు తాగించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. మద్యం అమ్మకాలు మరింతా పెంచుకోవడానికి మరో అడుగుముందుకు వస్తోంది అబ్కారీశాఖ. మహిళలు, యువతే అక్ష్యంగా ‘లో ఆల్కహాలిక్‌ డ్రింక్‌’ల పేరిట కొత్త మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ప్రియులకు మరింత నోరూరించే చర్యలకు తాజాగా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. యువత, మహిళలు విరివిగా వాడే మద్యాన్ని పెంచే చర్యలకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మద్యం సేవించని వారిని మద్యపానంలోకి ఆహ్వానం పలికేలా కొత్త ఉత్పత్తు లతో, ఆకర్షిణీయ హంగులతో ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. మహిళలకు, అలవాటు లేని యువతకు వల వేసేందుకు ‘లో ఆల్కహాలిక్‌’ మద్యాన్ని మార్కెట్‌లోకి తెస్తోంది. ఈ ఏడాది జనవరిలో తక్కువ ఆల్కహాల్‌ పరామాణం ఉన్న రెడీ టూ డ్రింక్‌ మద్యం ‘స్ప్లాష్‌’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చేందుకు అనుమతులు మంజూరీ చేసిన నల్లారి సర్కార్‌ తాజాగా నాలుగు రకాల కొత్త రెడీ టూ డ్రింక్‌ మిశ్రమాల ఉత్పత్తులకు అనుమతులు మంజూరీచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో అమ్ముడవుతోన్న బకార్డీ బ్రీజర్‌, షార్ట్‌‌స, స్ప్లాష్‌ అనే తక్కువ ఆల్కాహాలిక్‌ పరిమాణం కలిగిన బ్రాండ్లకు తోడుగా కొత్తగా టీచర్స్‌ రెడీ డ్రింక్‌, కోలా, బ్లెండెడ్‌ సోడాలను రాష్ట్ర మార్కెట్‌లోకి అనుమతించింది. మహారాష్ట్రలో ఉన్న మెస్సర్స్‌ బీమ్‌ గ్లోబల్‌స్పిరిట్స్‌ అండ్‌ వైనరీ ప్రై.లి. కంపెనీకి ఈ ఉత్పత్తులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇప్పటికే డిసెంబర్‌ 31న 4000 కేసులను ఈ సంస్థ విక్రయించింది. దీంతో మనరాష్ట్రంలోకి వీటికి అనుమతులిస్తూ ప్రభుత్వం ద్వారాలు తెరిచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: