అనగనగా ఒక ఊరిలో రామయ్య, రంగయ్య అనే  ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వీరిద్దరూ ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండేవారు. ఇక రామయ్య అందరితో మంచిగా ఉంటూ, తోచిన సహాయం చేస్తూ ఉండేవాడు . అందుకే అతడంటే అందరికీ గౌరవం, మర్యాద. ఇక రంగయ్య విషయానికొస్తే, రంగయ్య పరమ పిసినారి. రామయ్యకు ఊరిలో అందరూ మర్యాదిస్తుంటే రంగయ్యకు అది కుళ్ళు గా అనిపించేది. రంగయ్య తన పెరటి మొత్తం శుభ్రం చేసి, ఆ చెత్త అంత ప్రహరీ గోడపై నుంచి రామయ్య పెరట్లో వేసేవాడు.

ఎప్పటిలాగే ఒకరోజు చెత్తనంతా రంగయ్య, రామయ్య పెరట్లో వేస్తున్నప్పుడు రామయ్య చూసి.. "మీ ఇంట్లో ఉన్న చెత్తను నా ఇంట్లో పడవేయడం బాగాలేదు రంగయ్య " అని అన్నాడు.. అప్పుడు రంగయ్య "మా ఇంట్లో చెత్తను మీ ఇంట్లో వేయవలసిన అవసరం నాకేంటి "అని దబాయించాడు.

ఇక ఒక రోజు రంగయ్య ఇంటికి పొరుగూరి జమీందారు అయినటువంటి సుబ్బయ్య వచ్చాడు. అతని కొడుకుని అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నాడు రంగయ్య. ఎలాగైనా సరే సుబ్బయ్య తో..మీ కొడుకుకి నా  కూతుర్ని ఇచ్చి వివాహం చేయాలని ..సుబ్బయ్య తో అన్నాడు రంగయ్య. అందుకు సుబ్బయ్య సరే చూద్దాంలే అని బదులిచ్చాడు.

తర్వాత సుబ్బయ్య ఆ ఊళ్లోనే రామయ్య అనే స్నేహితుడు ఉన్నాడు అని ,ఆయన్ని కలవాలని రంగయ్య తో  చెబితే.. అతడు ఉండేది ఇక్కడే .వెళ్దాం పదండి.. అంటూ సుబ్బయ్య ని తీసుకొని రామయ్య ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ రామయ్య తన స్వభావం గురించి సుబ్బయ్య తో చెడుగా చెప్తాడేమో అని భయం మొదలైంది. రామయ్య, సుబ్బయ్య ఇద్దరు ఆప్యాయంగా ఒకరినొకరు పలుకరించుకున్నారు. ఇక అడగకుండానే రంగయ్య మంచి వ్యక్తి అని సుబ్బయ్య తో చెప్పాడు రామయ్య.

అప్పుడు సుబ్బయ్య .."నా స్నేహితుడు చెప్పాడు.. కాబట్టి మన వియ్యానికి అడ్డం ఉండదు. ఆలస్యమవుతోంది.. నేను వెళ్తాను" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

సుబ్బయ్య వెళ్లగానే .."నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. నీకు అదేమీ గుర్తులేదా రామయ్య.." అని అడిగాడు రంగయ్య. "ఎవరిలోనైనా మంచినే తప్ప చెడును గుర్తుపెట్టుకో నేను. ఒకవేళ గుర్తున్న ఒకరి గురించి చెడుగా చెప్పే స్వభావం నాది కాదు" అని బదులిచ్చాడు రామయ్య. ఇక తన మంచి స్వభావాన్ని చూసిన రంగయ్య , అప్పటినుంచి తన స్వభావాన్ని కూడా మార్చుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: