ప్రపంచానికంతా తెలుసు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించిందని. కేంద్ర ఎన్నికల కమీషన్ తరపున రిటర్నింగ్ అధికారి ఎంపిగా గెలిచినట్లు వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసిన డాక్టర్ గురుమూర్తికి సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. అయితే చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రం ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మే గెలిచినట్లు కొత్తరాగం మొదలుపెట్టారు. అదేమిటయ్యా అంటే నైతికంగా తమ అభ్యర్ధి పనబాకే గెలిచినట్లుగా తమ మీడియాలో విస్తృతంగా విచిత్రమైన ప్రచారం మొదలుపెట్టారు. మామూలుగా ఎక్కడైనా గెలుపు అంటే ఒకటే ఉంటుంది. పోటీచేసిన వాళ్ళల్లో అత్యధికంగా ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళే గెలిచినట్లు లెక్క. జనాలందరు ఇప్పటివరకు అలాగే అనుకుంటున్నారు.




కానీ తిరుపతి ఉపఎన్నికలో సాంకేతికంగా ఒకళ్ళు గెలిచినట్లు, నైతికంగా మరొకరు గెలిచినట్లుండదు. కానీ చంద్రబాబు, reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళంతా ఓ పద్దతి ప్రకారం ఇలాగే ప్రచారం మొదలుపెట్టారు. పనబాకదే నైతిక విజయమంటు మొదలైన ప్రచారం వెనుక ఏదైనా వ్యూహం ఉందేమో చూడాలి. ఏ విషయంలో అయినా ప్రత్యర్ధులపై బురదచల్లటంలో టీడీపీకి మించిన బలమైన పార్టీ దేశంలోనే మరొకటి లేదని అందరికీ తెలిసిందే. టీడీపీకి ఇంతటి బలం ఎలా వచ్చిందంటే కేవలం వ్యవస్ధలను మ్యానేజ్ చేయటం వల్లే అని వైసీపీ నేతలు ఎప్పటినుండో ఆరోపిస్తున్నారు. వ్యవస్ధలంటే ఇక్కడ మీడియా అనే అర్ధం. కేసీయార్ దెబ్బకు చంద్రబాబు అండ్ కో తెలంగాణాను వదిలి పారిపోయారు.




కానీ ఏపిలో మాత్రం మీడియావరకు చంద్రబాబు తన పట్టును కంటిన్యు చేస్తునే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వంపై బురదచల్లటమే టార్గెట్ గా పెట్టుకున్న టీడీపీ+ఎల్లోమీడియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా తిరుపతి ఉపఎన్నికనే ఉదాహరణగా తీసుకుంటే ఓడిపోయిన పనబాకది నైతిక విజయం ఏమిటి ? ఇదే నిజమైతే మరి టీడీపీ హయాంలో జరిగిన నంద్యాల ఉపఎన్నికలో ఓడిపోయిన వైసీపీదే నైతిక విజయమంటే చంద్రబాబు అంగీకరించేవారేనా ? పనబాక మీడియాతో మాట్లాడుతు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగుంటే తనదే విజయమని చెప్పటమే పెద్ద జోక్. మనదేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా ఎప్పుడు జరిగాయి ? నంద్యాల ఉపఎన్నికలో అప్పట్లో జరిగిన అరాచకంతో పోల్చుకుంటే ఇపుడు జరిగిన గొడవలు చాలా తక్కువనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: