1918 జనవరి 12న జన్మించిన సి రామచంద్ర భారతీయ చలనచిత్రం, చలనచిత్రేతర సంగీతంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. రామచంద్ర మహారాష్ట్రలోని పుంతంబేలో స్టేషన్‌ మాస్టర్ కొడుకుగా జన్మించాడు. అతను పండిట్ వినాయక్‌బువా పట్వర్ధన్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. రామచంద్ర నర్హర్ చితాల్కర్ నుండి సంగీత దర్శకుడిగా మారినప్పుడు తన పేరును సి రామచంద్రగా మార్చుకున్నాడు.

ఆ రోజుల్లో మరాఠీ చిత్ర పరిశ్రమకు గుండెకాయ ఆయన. YV రావు నాగానంద్ (1935)లో అతను ప్రధాన పాత్ర పోషించాడు. సయీద్-ఎ-హవాస్ (1936), ఆత్మ తరంగ్ (1937)లో రెండు పాత్రలను చేశాడు.  మీర్ సాహెబ్ వద్ద అతని శిష్యరికం అతనికి తమిళ చిత్రాలకు సంగీతాన్ని అందించడానికి రెండు అసైన్‌మెంట్‌లను తెచ్చిపెట్టింది. అతను తన మొదటి హిందీ చిత్రం సుఖీ జీవన్ (1942)కి 'హిందుస్తాన్ హమారా హై, హమ్‌కో జాన్ సే ప్యారా హై' పాటతో సంగీతాన్ని అందించాడు. ఈ పాట మంచి ఆదరణ పొందింది.

షెహనాయ్ (1947), అనార్కలి (1953) మరియు నాస్తిక్ (1954) వంటి చిత్రాలకు హిట్ సంగీతాన్ని అందించాడు. ఆయన, లతా మంగేష్కర్ కలిసి 63 చిత్రాలలో దాదాపు 300 పాటలు పాడారు. సమాధి (1950)లోని యుగళగీతాలు 'గోరే గోరే ఓ బాకే చోర్' నుండి అల్బెలా (1951)లోని 'షోలా జో భడ్కే' వరకు వీళ్ళ పాటలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను కంటతడి పెట్టించిన 'ఏ మేరే వతన్ కే లోగోన్' పాటను కూడా లతా, రామచంద్ర కలిసి పాడారు. అయితే 1960ల మధ్యకాలం తర్వాత రామచంద్ర ఆయనకు రాజ్ తగ్గింది. 5 జనవరి 1982న బొంబాయిలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో మరణించాడు. అలా సంగీతంతో ఒక స్టేషన్ మాస్టర్ కొడుకు ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అయితే ఆ తరువాత పరిస్థితుల కారణంగా ఆయనకు కేజ్ తగ్గుతూ వచ్చింది,

 



మరింత సమాచారం తెలుసుకోండి: