సన్రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఒక పసికూనల ప్రస్థానాన్ని ప్రారంభించింది. కానీ ఇక కొన్ని రోజుల్లోనే ఏకంగా టైటిల్ విజేతగా నిలిచి అందరి చూపులు తన వైపు ఆకర్షించింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కప్ గెలవడం.. ఒకసారి రన్నరప్గా నిలవడం తో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఎన్నో సీజన్ల నుంచి పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ వస్తోంది. ప్రతి మ్యాచ్ లో కూడా నిరాశ పరుస్తూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే జట్టులో ఉన్న కొంతమంది స్టార్ బ్యాట్స్ మెన్లు అద్భుతంగా రాణిస్తూ భారీగా పరుగులు చేసినప్పటికీ ఎందుకో సన్రైజర్స్ కి మాత్రం అద్భుతం ఎక్కడ కలిసి రావడం లేదు.



 అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో మంచి కెప్టెన్ గా గుర్తింపు సంపాదించుకున్న వారు సన్రైజర్స్ హైదరాబాద్ ముందుకు నడిపించిన జట్టు తీరులో మాత్రం మీరు ఏమీ మార్పు రావడం లేదు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటివరకు మిగతా జట్లతో పోటీ ఇస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో భారీగా పరుగులు చేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక ఆ ఆటగాళ్ల లిస్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతూన్నాడు డేవిడ్ వార్నర్. ఏకంగా సన్రైజర్స్ తో ఆడిన మ్యాచ్ లో నాలుగు వేల 14 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్.


 అంతేకాదు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోనే అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవడం  గమనార్హం. అలాంటి కీలక ఆటగాడిని సన్రైజర్స్ యాజమాన్యం జట్టునుంచి వదిలిపెట్టింది. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ తరపున శిఖర్ ధావన్ 2518 పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.  కొన్ని సీజన్లలో పాటు సన్రైజర్స్ కు వాడిన శిఖర్ ధావన్ జట్టు గెలుపులో కీలక పాత్ర వహించాడు. ప్రస్తుత కెప్టెన్ కేన్ విలియమ్సన్ 1885 పరుగులు చేసి మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత మనీష్ పాండే 1345 పరుగులు బెయిర్ స్ట్రో  ఒక వెయ్యి 38 పరుగులు చేసి వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl