ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్రైడర్స్ మధ్య ఐపీఎల్ లో భాగంగా మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో భాగంగా మొదట కోల్కతా నైట్రైడర్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే అటు బెంగుళూరు బౌలర్లు పట్టు బిగించడంతో కోల్కత్తా  బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కూలిపోయింది అని చెప్పాలి. ఒకానొక సమయంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక కోల్కతా నైట్రైడర్స్ జట్టు స్కోరు కనీసం వంద పరుగులు అయినా దాటుతుందా లేదా అని అభిమానులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ చివరికి 128 పరుగులు చేయగలిగింది కోల్కత నైట్ రైడర్స్ జట్టు.


 ఇక ఆ తర్వాత ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో కోల్కతా సక్సెస్ అయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ మొత్తం ఎంత ఉత్కంఠ భరితంగా మారిపోయింది.. ఇక చివరి ఓవర్ వరకు ఎవరు విజయం సాధిస్తారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇక చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించడంతో చివరికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన మొదటి మ్యాచ్లో విజయం సాధించిన కోల్కత నైట్రైడర్స్ జట్టుకు రెండో మ్యాచ్లో మాత్రం ఓటమి తప్పలేదు. అయితే కోల్కత నైట్ రైడర్స్ ఓడిపోయినప్పటికీ అటు జట్టు బౌలర్లు ఉమేష్ యాదవ్ వరుణ్ చక్రవర్తి మాత్రం సరికొత్త రికార్డు నెలకొల్పారు.


 బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో ప్రధాన బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలం అయిన వేళ ఇక ఇద్దరు బౌలర్లు కలిసి ఆఖరి వికెట్కు 27 పరుగులు జత చేశారు. ఇక మరో విషయం ఏమిటంటే.. కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఉమేష్ యాదవ్ 18 పరుగులు వరుణ్ చక్రవర్తి 10 పరుగులు చేశారు. ఇక వీరిద్దరూ చివర్లో రాణించడంతో కోల్కతా జట్టు 128 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది అని చెప్పాలి. అయితే 10, 11 స్థానాలలో వచ్చిన బ్యాట్స్మెన్లు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఐదో సారి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl