ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హార్దిక్ పాండ్యా. ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ ముందు వరకు కూడా గాయాల బారిన పడి చివరికి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎన్నో రోజులపాటు టీం ఇండియాకు దూరమయ్యాడు. కానీ ఐపీఎల్ లో అసమాన్యమైన రీ ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పాలి. గుజరాత్ కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపిస్తూ ఒక ఆటగాడిగా తనలో ఉన్న అత్యుత్తమ ప్లేయర్ ను బయట పెట్టాడు. చివరికి గుజరాత్ జట్టుకు టైటిల్ కూడా అందించాడు.


 ఆ తర్వాత టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్న హార్థిక్ పాండ్య ఎక్కడ వెనక్కి తిరిగి చూడడం లేదు. ఒకవైపు బౌలింగ్లో నిప్పులు చెరుగుతూనే మరోవైపు బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇక ఫీల్డింగ్ లో హార్దిక్ పాండ్యా ఎంత చురుకుగా ఉంటాడో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ లో అతని ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేదానిపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారని చెప్పాలి. ఇకపోతే ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ హార్దిక్ పాండ్యా ప్రతిభ పై ప్రశంసలు కురిపించాడు.


 హార్థిక్ పాండ్యా ఎంతో ప్రతిభవంతుడైన క్రికెటర్ అతడు 140 కిలోమీటర్ల స్పీడ్ తో బౌలింగ్ చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. అతనికి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సత్తా కూడా ఉంది. అతని బ్యాటింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా మరింత రాటుదేలాడు. హార్దిక్ కేవలం ఫినిషర్ మాత్రమే కాదు పవర్ హిట్టర్ కూడా. అతనిలో అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి. గుజరాత్ కి టైటిల్ ను ఎలా అందించాడో ఇక టీమిండియా కు వరల్డ్ కప్ అతను అందించగలడు అంటూ  షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: