మొన్నటి వరకు పేలవమైన ఫామ్ తో ఇబ్బందిపడి ఇక ఆసియా కప్ లో మళ్ళీ ఫామ్ నిరూపించుకుని వరల్డ్ కబ్లో టాప్ స్కోరర్ గా నిలిచిన విరాట్ కోహ్లీ కొంతకాలం పాటు టి20 ఫార్మాట్ కు దూరం కాబోతున్నాడ అంటే మాత్రం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అవును అనే సమాధానమే చెబుతూ ఉన్నారు. ఇప్పటికే టీ20 లో అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగి మెగాటోర్ని అయిన టి20 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ ఇక విరాట్ కోహ్లీ ఎందుకో పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే కేవలం టి20 ఫార్మాట్ కు మాత్రమే కొంతకాలం బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నా విరాట్ కోహ్లీ వన్డే టెస్ట్ ఫార్మాట్లకు మాత్రం ఎప్పటిలాగానే యధావిధిగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక కొత్త ఏడాదిలో జనవరి మూడవ తేదీ నుంచి శ్రీలంకతో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ లో కూడా కోహ్లీ చెప్పినట్లుగానే జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే  పాండ్యా కెప్టెన్సీలో బలిలోకి దిగబోయే టీమ్ ఇండియాలో  కోహ్లీ పేరు కనిపించలేదు. కానీ ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్ ఆడబోయే జట్టులో మాత్రం విరాట్ కోహ్లీ పేరు ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యం తర్వాత సీనియర్లను పొట్టి ఫార్మాట్ నుంచి తప్పించి హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడమే కాదు జట్టు నిండా యువ ఆటగాళ్లను తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.



 ఈ క్రమంలోనే అటు బీసీసీఐ కూడా అటువైపుగా అడుగులు వేస్తుంది అన్న ప్రచారం కూడా ఊపందుకుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక కోహ్లీ టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నాడని ప్రచారం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున మాత్రమే కాదు మొత్తంగా టోర్నీలోనే టాప్ స్కోరరుగా నిలిచిన కోహ్లీ టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉండాలి అనుకుంటుంటే అటు పేలవమైన ప్రదర్శనతో టీమిండియా కు భారంగా మారిపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కే ఎల్ రాహుల్ మాత్రం అలాంటి ఆలోచన చేయడం లేదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తమకు తాముగా తప్పుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు కొంతమంది ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: