
ఇంకా చాలా ఏళ్లపాటు అటు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతారని అభిమానులు నమ్మకం పెట్టుకున్న వేళ క్రికెటర్లు మాత్రం తమ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఊహించని షాక్ లు ఇస్తున్నారు. మరికొంతమంది ఏదో ఒక ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఒక్క ఫార్మాట్ ను మాత్రమే అంటిపెట్టుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ టిమ్ ఫైన్ ఇక ఇలాంటి నిర్ణయం తీసుకొని అభిమానులందరికీ కూడా షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ అయిన టిమ్ ఫైన్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.
బ్లాండ్ స్టోన్ ఎరినాలో క్వీన్స్ ల్యాండ్ తో జరిగిన టస్మానియా మార్ష్ షఫీల్డ్ మ్యాచ్ అనంతరం ఇలా టిమ్ ఫైన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు అని చెప్పాలి. కాగా టిమ్ పై 2018 నుంచి 2021 మధ్య 23 టెస్టులకు ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు అని చెప్పాలి. 2005లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టీమ్ ఫైన్ తర్వాత 154 ఫస్ట్ క్లాస్ మ్యాచులలో కూడా రాణించాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లో ఆడి అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి.