టీమిండియాను గత కొంతకాలం నుంచి గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్న ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఇక కీలకమైన టోర్నీలకు దూరం అవుతున్న నేపథ్యంలో జట్టు వ్యూహాలు మొత్తం తారుమారు అవుతున్నాయి. అదే సమయంలో భారత జట్టు అంత పటిష్టంగా కూడా కనిపించడం లేదు అని చెప్పాలి. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో కూడా భారత జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా గాయం బారిన పడి గత కొన్ని నెలల నుంచి కూడా టీమ్ ఇండియాకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. అయితే మొన్నటికి మొన్న గాయం నుంచి కోలుకొని శ్రేయస్ అయ్యర్ మళ్ళీ తిరిగి వచ్చాడు అని సంతోషపడే లోపే.. మళ్లీ గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. కాగా అతని గాయం తీవ్రత మరింత ఎక్కువగా ఉందని సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని బిసిసిఐ వైద్యులు భావిస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే ఇక కొన్ని నెలలపాటు శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు అందుబాటులో ఉండడం మాత్రం కష్టమే అన్నది తెలుస్తుంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో గాయం బారిన పడిన శ్రేయస్ అయ్యర్  బ్యాటింగ్ కి ఫీల్డింగు రాలేదు.


 అయితే సర్జరీ తర్వాత అతను కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందట. దీంతో అతను ఐపిఎల్ తో పాటు ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి కూడా అందుబాటులో ఉండబోడు అన్నది తెలుస్తుంది. అయితే అక్టోబర్, నవంబర్లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో మాత్రం శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి వస్తాడట. ఇకపోతే ఇక శ్రేయస్ అయ్యర్ ఐపిఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి సారధిగా వ్యవహరిస్తున్నాడు. ఇక గాయం కారణంగా అయ్యర్ దూరమైన నేపథ్యంలో కోల్కతా యాజమాన్యం కొత్త కెప్టెన్ ను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: