
ఇలా ఏకంగా కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు చివరికి ఇక జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో జట్టు ప్రణాళికలు మొత్తం తారుమారు అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక కీలక ఆటగాళ్లను దూరం అవడంతో కొన్ని జట్లు కాస్త బలహీనంగా కూడా మారిపోతూ ఉన్నాయి. అయితే ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఇలాంటి ఊహించని షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న యువ ప్లేయర్ గాయం కారణంగా జట్టుకు దూరం కాబోతున్నాడు.
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చిన తర్వాత మంచి ప్రదర్శన చేసి జట్టులో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు రజత్ పటిదార్. ఇటీవలే అతనికి మడమ గాయం అయినట్లు తెలుస్తుంది. దీంతో ఐపీఎల్ ఫస్ట్ స్టాప్ కి అతను దూరం కాబోతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటున్నాడని తెలుస్తుంది. ఇక కోలుకునేందుకు మూడు వారాల సమయం పడుతుందట. కాగా గత సీజన్లో రజత్ పాటీధర్ అద్భుతంగా రాణించాడు. 152 స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులు చేశాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసెస్ తర్వాత ఎక్కువ పరుగులు చేసింది రజత్ పటీదార్ కావడం గమనార్హం.