ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమమైన ఆల్ రౌండర్ల లిస్టు తీస్తే అందులో మొదట వినిపించే పేరు భారత స్టార్ ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా అని చెప్పాలి. ఎందుకంటే బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా సత్తా చాటుతూ అదరగొడుతూ  ఉంటాడు రవీంద్ర జడేజా. అంతేకాదు మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్ తో  ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఆల్రౌండర్ అంటే ఇలాగే ఉండాలేమో అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అనుకునే విధంగా అతని ఆట తీరు ఉంటుంది.


 రవీంద్ర జడేజా లాంటి ఆల్ రౌండర్ మాకు ఉండి ఉంటే బాగుండేది అని ఇక ప్రతి జట్టు కూడా అసూయపడేలా అతని ప్రస్తానం  కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు అటు ఐపీఎల్లో సైతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంతో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ ఇదే రీతిలో మంచి ప్రదర్శన చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు రవీంద్ర జడేజా. ఇకపోతే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్  జట్టుతో జరిగిన మ్యాచ్ లో  బౌలింగ్లో మంచి ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఈ ఐపిఎల్ సీజన్లో ఒక అరుదైన ఘనతను సాధించాడు జడేజా.  ఇప్పుడు వరకు 2023 ఐపీఎల్ సీజన్లో 29 మ్యాచులు జరిగితే.. ఏ ఒక్క ప్లేయర్ కూడా రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోలేదు. కానీ ఈ ఘనతను ఇటీవల చెన్నై హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ జడేజా సాధించాడు. జడేజా ముంబై తో జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఈ అవార్డు అందుకున్నాడు. సన్రైజర్స్ మ్యాచ్లో కేవలం 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: