
2020 అండర్ 19 వరల్డ్ కప్ తర్వాత భారత దేశ వాలి క్రికెట్లో అతను ఒక సంచలనంగా మారిపోయాడు అని చెప్పాలి. నిలకడైన ప్రదర్శనలతో అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేస్తూ ఉన్నాడు యశస్వి జైస్వాల్. ఇక ఈ కుర్రాడి కోసం ఐపీఎల్ 2020 వేలంలో పోటీ పడ్డాయి ఫ్రాంచైజీలు. 20 లక్షల బేస్ ప్రైస్ తో ఐపిఎల్ లోకి వచ్చిన ఇతని కోసం రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టింది రాజస్థాన్ రాయల్స్. స్టార్ ప్లేయర్లను పక్కనపెట్టి మరి అతన్ని జట్టులోకి తీసుకుంది. ఇక తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అతను వమ్ము చేయకుండా అదరగొడుతున్నాడు.
గతంలో రంజీ ట్రోఫీతో పాటు ఇరానీ ట్రోఫీ లోను సెంచరీల మూత మోగించిన యశస్వి జైస్వాల్ ఇక ఐపీఎల్ లో కూడా మెరుపు ప్రదర్శనలు చేశాడు అని చెప్పాలి. బతుకుతెరువు కోసం పానీ పూరి అమ్మిన ఈ కుర్రాడు.. ఇక ఇప్పుడు 2023 ఐపీఎల్ లో సంచలన ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవైపు బట్లర్ లాంటి సీనియర్ ప్లేయర్ సైతం దూకుడుగా ఆడుతున్న యశస్వికి స్ట్రైక్ ఇవ్వడానికి ఆసక్తి చూపాడంటే అతని విధ్వంసం ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే టీమిండియా ఓపెనర్ గా అతను బాగా సరిపోతాడని.. వెంటనే అతని జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు కోరుతున్నారు.