
మెరుపు హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఇటీవల బౌలర్లపై వీర విహారం చేసి 36 బంతులు ఆరు ఫోర్లు, సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు పృథ్వి షా. అయితే పృథ్విష బ్యాట్ నుంచి ఇలా హాఫ్ సెంచరీ రావడంతో అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు అని చెప్పాలి. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత డగవుట్ వైపు చూపిస్తూ పృథ్విషా వింత సంబరాలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే తన వింత సంబరాలు వెనక కారణం ఏంటి అన్న విషయాన్ని ప్రతి విషయం తెలిపాడు.
ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత ఎందుకు అలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు అంటూ పృద్విషాను వివరణ కోరగా.. అసలు కారణం చెప్పుకొచ్చాడు. పంజాబ్ కింగ్స్ ఫెసర్ లు వేసిన బౌన్సర్లతో తన రెండు చేతులకు గాయాలు అయ్యాయని.. అదే విషయాన్ని తమ డగ్ అవుట్ లో తెలిసేలా సెలబ్రేషన్స్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ప్రతిఫలం దక్కదు. కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంది. బంతి నేరుగా బ్యాట్ మీదికి వస్తుంది అంటూ పృథ్విషా చెప్పుకొచ్చాడు.