
అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏ ప్లేయర్ ఎప్పుడు ఏ జట్టులోకి వెళ్లిపోతాడు అన్నది ఊహకందని విధంగానే మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక ప్రాంతానికి చెందిన క్రికెటర్ ఇక ఐపీఎల్ లో వేలం కారణంగా ఇక మరో ప్రాంతానికి చెందిన టీం లోకి వెళ్లడం చూస్తూ ఉంటాం. దీంతో ఇక సొంత ప్రాంతానికి చెందిన జట్టు పైనే వేరొక టీం తరఫున ప్రాతినిధ్యం వహించి ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఐపీఎల్ ఫైనల్ లో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. గుజరాత్ కు చెందిన ఒక ప్లేయర్ చెన్నై తరపున ఆడి గుజరాత్ ను ఓడించడానికి ప్రయత్నిస్తే.. ఇక చెన్నైకి చెందిన ప్లేయర్ గుజరాత్ తరపున చెన్నైని ఓడించేందుకు వీరోచిత పోరాటం చేశాడు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ నాలుగు పరుగులు దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు. సాయి సుదర్శన్ తమిళనాడుకు చెందిన ప్లేయర్. కానీ ఇతని సొంత రాష్ట్రానికి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ కి వ్యతిరేకంగా గుజరాత్ తరఫున ఆడి ఏకంగా చెన్నై జట్టును ఓడించాలనుకున్నాడు. అదే సమయంలో ఇక గుజరాత్ కు చెందిన రవీంద్ర జడేజా చెన్నై తరపున ఆడీ సొంత రాష్ట్రానికి చెందిన గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించాడు. ఇక ఈ విషయం తెలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏదైనా సాధ్యమే. ఇక అన్ని విషయాలను కూడా స్పోర్టివ్ గా తీసుకోవాలి అంటూ ఎంతో మంది ఐపిఎల్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.