ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సంగీత దర్శకుల లో అనిరుద్ రవిచంద్రన్ ఒకరు . ఈయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా మారాయి . ఈయన ప్రస్తుతం అద్భుతమైన బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు . దానితో ఎక్కువ శాతం ఈయన స్టార్ హీరోల సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలకు సంగీతం అందిస్తూ వెళ్తున్నాడు . ఇప్పటికే ఈయన పలు తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందించాడు . ఈయన సంగీతం అందించిన తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలు మంచి విజయాలనుకూడా అందుకున్నాయి.

ఈయన రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ అనే తెలుగు సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మ్యూజిక్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పటికే ఈయన టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి , జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీలకు కూడా సంగీతం అందించాడు. ఇకపోతే ఓ టాలీవుడ్ కుర్ర హీరో సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ నటించబోయే మూవీ కి అనిరుద్ సంగీతం అందించబోతున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిజం గానే సిద్దు సినిమాకు అనిరుద్ సంగీతం అందించినట్లయితే ఆ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయికి చేరుతాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: