శివకేశవులకు అబేధం లేదని నిరూపించే మాసం ఈమహిమాన్వితమైన కార్తీక మాసం. ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం అంటేనే స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం వంటివి చేయడం వలన జన్మ జన్మల పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకునే మహిమాన్వితమైన మాసంగా భక్తులంతా గట్టిగా నమ్ముతారు .