పెద్దపెల్లి జిల్లా మంథని లోని ప్రసిద్ధ నాగేంద్ర విగ్రహానికి నాగుల చవితి సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు. నాగుల చవితి రోజు నాగేంద్రనికి పాలతో అభిషేకించడం ఆనవాయితీగా వస్తుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా మహిళలు తండోప తండాలుగా వచ్చి ఈ నాగేంద్రుని ఆలయంలో నాగుల చవితి రోజున పూజలు నిర్వహిస్తారు. పురాతన కాలం నుండి  ఈనాగేంద్రునికి పూజలు నిర్వహించి ఏదైనా కోరిక కోరినట్లయితే నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.


 ఉదయం 5 గంటల నుండే భక్తులు నాగేంద్రుని వద్ద బారులు తీరుతారు. నాగేంద్రుని విగ్రహానికి వస్త్రాలంకరణ చేయడం వలన విగ్రహ రూపం పూర్తిగా తెలియకుండా ఉన్నది.  నాగుల చవితి రోజున అర్ధరాత్రి నాగేంద్రుడు సర్ప రూపంలో వచ్చి ఇక్కడ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అని భక్తుల నోటి నుండి వినడం జరిగింది. దీని కారణంగానే ఈ ఆలయానికి విశిష్ట ప్రసిద్ధిదక్కినది అని నానుడి.


 నాగుల చవితి రోజు నాగేంద్రుడు కి వెండి నాగ ప్రతిమను సమర్పించిన  వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.    ఇదే నాగుల చవితి రోజు నాగేంద్రుని కరుణాకటాక్షాలు పొందడానికి కొంత మంది దాతలు పెద్ద మొత్తంలో పాలు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన భక్తులకు నాగేంద్రుని కి అభిషేకం చేయడానికి వీలుగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా వారు పాలను భక్తులకు అందిస్తారు. 


అయితే ఈవిధంగా పాలను అభిషేకం సమయంలో అందిస్తున్న వారికీ భక్తులు  కృతజ్ఞతలు  తెలుపుతూ సదా ఆ నాగేంద్రుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ  ఉండాలని ఆశీర్వదిస్తూ ఉంటారు.  ఇక్కడి స్థానికులు అందరూ చిన్నా, పెద్దా, ధనిక, భీద తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: