హోలీ పండుగను పురస్కరించుకుని అందరూ కొన్ని వస్తువులను దానం చేస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో ముఖ్యంగా బట్టలను, కొన్ని వస్తువులను దానం చేస్తుంటారు. అయితే ఈరోజున అన్ని వస్తువులను దానం చేయడం అంత మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి వేటిని దానం చేయకూడదో వేటిని దానం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్ద వాళ్ళు పురాతన కాలం నుండి చెబుతున్న ప్రకారం అన్ని దానాలలో విద్యా దానం గొప్పదిగా చెప్పేవారు. అయితే హోలీ పండుగ నాడు చేసే దానంలో పుస్తకాలను ఎటువంటి పరిస్థితుల్లో దానం చేయకూడదు. అంతే కాకుండా చదువుకు సంబంధించిన ఏ వస్తువులను కూడా మంటలో ఇవ్వకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఒకవేళ ఎవరైనా కనుక వీటికి విరుద్ధంగా చేసినట్లయితే వారి ఇంటిలో ఎన్నడూ పరిష్కారం కాని విధంగా సమస్యలు ఏర్పడుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా ఉక్కు పాత్రలను కూడా దానం చేయకూడదని ఉంది. మన కుటుంబంలో ఎవరో ఒకరు తెలిసో తెలియకో అటువంటి వస్తువులను దానం చేస్తే వారి కుటుంబంలో సుఖం, డబ్బు మరియు సంతోషం కోల్పోతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటువంటి ఇంటిలో ప్రశాంతత మరియు మనశాంతి కరువవుతాయని కూడా కొంత మంది నమ్మకం. ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి హోలీ రోజున ఉక్కు పాత్రలను అస్సలు దానం చేయకండి. మీకు తెలిసిన వారు ఎవరైనా చేస్తున్నా కూడా వద్దని చెప్పండి. హోలీ సందర్భంగా చాలా మంది ప్లాస్టిక్ వస్తువుల్లో రంగులు నింపి వేడుకలను జరుపుకుంటారు.

ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ గన్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా ఇవ్వడం వల్ల మీ ఇద్దరిలో ఎవరో ఒకరి కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయట. బాధలు కూడా పెరుగుతాయట. వాడిన నూనెను మాత్రం ఎప్పటికీ ఇవ్వకూడదట. ఎందుకంటే ఈ వాడిన నూనె వల్ల మీ కుటుంబంలో దుఃఖం, చెడు శకునాలు పెరుగుతాయట. ఇది శని దేవునికి కూడా కోపం తెప్పిస్తుందట. కాబట్టి వాడిన నూనెను హోలీ రోజున ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ హొలీ రోజున సంతోషంగా ఉండడంతో పాటుగా ఇవి కూడా గుర్తు పెట్టుకుని ఆచరించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: