వేలాదిమంది శ్రీరామనవమి పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు భారతీయులు. ముఖ్యంగా రాముడు పుట్టినరోజు శ్రీరామనవమి కావడం చేత భక్తీ శ్రద్ధలతో సీతారాముల కల్యాణాన్ని తిలకించి ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రీరామానికి ఇష్టమైన నైవేద్యాలను కూడా పూజలో ఉంచి మరి ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరామనవమి పండుగ రోజున పానకం, వడపప్పు శ్రీరాముడికి చాలా ప్రత్యేకంగా తయారు చేసే ఉంచుతారు. అసలు వీటిని నైవేద్యంగా ఎందుకు పెడతారో అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.


శ్రీరాముడికి బెల్లం అంటే చాలా ఇష్టమని.. తయారుచేసిన పిండి వంటలు ఎక్కువగా తినేవారట.. పురాణాలు తెలిపిన ప్రకారం.. వనవాసంలో ఉన్న సమయంలో అడవిలో దొరికేటువంటి మూలికలు గింజలతో పానకాన్ని తయారు చేసు  కొని తాగే వారిని వారిని పురాణాలు తెలియజేస్తున్నాయి. అప్పట్లో ఋషులు కూడా వడపప్పును శ్రీరామునికి నైవేద్యంగా ఇచ్చేవారట. అందుకే శ్రీరామనవమి రోజున భక్తులు ఎక్కువగా పానకం వడపప్పు సైతం తయారు చేసి మరి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంటిల్లిపాది కూడా ఆ పానకం తాగి వడపప్పును పంచుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తూనే ఉంది.


అయితే శాస్త్రం ప్రకారం వేసవికాలంలో పానకం తాగడం వల్ల శరీరానికి మంచి ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా యాలుకలతో చేసేటువంటి ఈ పానకం వల్ల ఎన్నో ఔషధ గుణాలు కూడా శరీరానికి లభిస్తాయట. ఇందులో ప్రోటీన్ పీచు పదార్థాలు కూడా ఉంటాయి. అయితే పానకం, వడపప్పు తయారు చేసుకోవాల్సి అంటే.. కాస్త బెల్లాన్ని తీసుకొని అందులోకి నీళ్లు పోసి.. బాగా కరిగిన తర్వాత కాస్త యాలకుల పొడి, మిరియాల పొడి, సొంపు, సొంటి, నిమ్మరసం వంటివి వేసి బాగా కలపాలి.. ఇలా బాగా అన్నిటినీ కలిపి మిక్స్ చేసిన తర్వాత పానకం తయారవుతుంది. శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా వానకం చేసి పంచడం వల్ల ఆ ఇంటిల్లిపాది మంచి జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: