ఆస్ట్రేలియాలో ఈ సంవత్సరం టి - 20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇక ధనాధన్ ధోనీ ఈ వరల్డ్ కప్ ఆడి తను రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం సీజన్లో మంచిగా ఆడేందుకు చెపాక్ స్టేడియంలో రెండు వారాలపాటు ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. కానీ... ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ఈ సంవత్సరం ఐపిఎల్ వాయిదా పడింది. దీనితో ప్రస్తుతం ధోని కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది. 

 


ఇక మరోవైపు ఐపీఎల్ ఆధారంగా ధోని కెరియర్ ని నిర్ణయించటం ఎటువంటి సమంజసం కాదు అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.  చాలామంది ధోని అభిమానులు T - 20 సీజన్లో ధోనీ ఎలా ఆడుతాడు అని చాలా ఆశగా ఎదురుచూశారు.. కానీ ఇప్పుడు టి 20 వరల్డ్ కప్ లో ధోనీకి అవకాశం దక్కుతుందా అని ఆలోచనలో పడ్డారు తన అభిమానులు. 

 


మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ... తన అభిప్రాయం ఇలా ఎందుకంటే ధోని కెరియర్ కేవలం ఐపీఎల్ ఆధారపడి డిసైడ్ చేయడం మంచిది కాదు అతను ఒక గొప్ప బ్యాట్స్ మెన్, ఒత్తిడిలోనూ తన జట్టును గెలిపించగలరు సామర్థ్యం అతనికి సొంతం అని చెప్పాడు. కనుక టి20 వరల్డ్ కప్ కి ధోనీని వద్దు అనడం సరైన నిర్ణయం కాదు అని మహమ్మద్ కైఫ్ తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: