ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకి చాపకింద నీరులాగా విజృంభిస్తుంది.  కరోనా వైరస్ ను నివారించుటకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో సినీ నటులు, క్రికెట్ ఆటగాళ్ళు అందరూ కూడా వారి ఇంటికే పరిమితమై వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఈ తరుణంలో కరోనాను అరికట్టేందుకు అందరూ (టీం మాస్క్ ఫోర్స్) #TeamMaskForce! లో చేరాలని టీమ్ ఇండియా ప్రముఖులు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ప్రజలను కోరడం జరిగింది.

 

 

వీరు అందరూ కూడా తాము స్వయంగా తయారుచేసుకున్న మాస్క్ లను వాడుతూ.. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలని వీడియో ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వడం జరిగింది. బీసీసీఐ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా చేసుకొని ట్వీట్ చేయడం జరిగింది. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కొందరు మహిళా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఇక ఈ వీడియోలో విరాట్ కోహ్లీ వి అక్షరం ఉన్న మాస్క్ ను ఉపయోగించగా... బీసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాస్క్ పై దాదా అని రాశి ఉండడం గమనార్హం.. ఇక సౌరవ్ గంగూలీ కరోనా అరికట్టేందుకు ప్రధాన మోడీ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లాగానే ఈ మార్క్ ఫోర్స్ కూడా అని తెలియజేయడం జరిగింది..

 

 

ఇక మరోవైపు మహిళా క్రికెటర్ స్మృతి మందాన.. భారతీయులంతా ఇంట్లోనే ఉండి మాస్కులు తయారు చేసుకోవాలని అందరికీ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా మాస్కులను వారే తయారుచేసుకొని ఖచ్చితంగా ఉపయోగించాలని రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, రాహుల్ ద్రావిడ్ ప్రజలకు సూచించడం జరిగింది. ఇక చివరికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాట్లాడుతూ... మా ప్రజలందరూ కూడా ఫోర్స్ లో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. దీనితో పాటు తరచుగా చేతులను 20 సెకండ్ల పాటు శుభ్రం చేసుకోండి అంటూ పిలుపునిచ్చాడు. దీనితో పాటు సామాజిక దూరం తప్పకుండా పాటించాలని సచిన్ టెండుల్కర్ తెలియజేయడం జరిగింది...

మరింత సమాచారం తెలుసుకోండి: