ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎంఎస్ ధోని. 2019లో ప్రపంచకప్ తర్వాత క్రికెట్కు పూర్తిగా దూరమైన ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రస్తావన వస్తుంది . ధోని  పునరాగమనంపైనే  ప్రస్తుతం అందరిలో ఒక ప్రశ్న నెలకొంది. వచ్చే ప్రపంచ కప్ లో ధోనీ అసలు జట్టులో ఉంటాడా లేదా అనేది కూడా ప్రస్తుతం అభిమానులు అందరూ మెదులుతున్న ప్రశ్న. దాదాపు ఎనిమిది నెలలు గడిచి పోతుంది.కానీ  ఇప్పటివరకు ధోనీ అసలు మైదానంలోకి అడుగుపెట్టింది లేదు క్రికెట్ వైపు చూసింది లేదు. 

 

 

 ఈ క్రమంలోనే ఐపీఎల్లో ధోనీ రాణించిన తర్వాత టీమిండియాలో ఆడేందుకు తన తలుపులు తెరుచుకునేల  మెరుపులు మెరిపిస్తాడు  అని చాలా మంది అనుకున్నారు.  కానీ ఇప్పుడు ఐపీఎల్ కాస్త రద్దవటంతో  ధోనీ కెరీర్ మరింత ప్రశ్నార్థకంగా మారిపోయింది.. చాలా మంది ప్రముఖులు కూడా ఐపీఎల్ రద్దు కావడంతో ధోనీ మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయడం అసాధ్యం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక తాజాగా భారత మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా  ధోని కి అండగా నిలిచాడు. ధోని  జట్టులోకి రావడానికి ఐపీఎల్ లో ప్రదర్శనకు అసలు సంబంధమే లేదు అంటూ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ జరగకపోయినా టీమ్ ఇండియా  మేనేజ్మెంట్ ధోనీ ని జట్టులోకి తీసుకోగలడు  అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడిందని ఈ  ఏడాది అక్టోబర్లో టి20 వరల్డ్ కప్ జరిగే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయని తెలిపారు. 

 

 

ధోని కెరీర్ లో వరుసగా 18 నెలల పాటు ఒక వేళ గ్యాప్ వచ్చినట్లయితే... అతను ఇక టీమిండియా తర్వాత ఎప్పుడు ఆడకూడదు అని అనుకుంటున్నాడు అని అందరూ అభిప్రాయపడవచ్చు అంటూ తెలిపాడు . అయితే ఈ రోజు వరకు అటు అభిమానులు ఇటు నెటిజన్లు మరోవైపు క్రికెట్ దిగ్గజాలు కూడా ఐపీఎల్ రద్దవడంతో  జట్టులోకి పునరాగమనం చేయడం కష్టతరమైన పని అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వేల తాజాగా ఆకాష్ చోప్రా దీనికి అండగా నిలబడ్డాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: