సాధారణంగా క్రీడాకారులు అందరు కూడా ఎంతగానో ఇష్టపడేది ఒలంపిక్స్ మెగా టోర్నీని. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనే క్రీడాకారులు మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఇక ఒలింపిక్స్లో పతకం సాధించాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎంతో మంది క్రీడాకారులు ఇక ఒలంపిక్స్ లో పథకం గురించి ఎన్నో ఏళ్ల నుంచి శ్రమిస్తూ ఉంటారు.  అప్పటి వరకు ఎన్ని మెడల్ సాధించిన ఒలింపిక్స్ లో  మెడల్ కి మాత్రం ఎంతో ప్రత్యేక గౌరవం ఇస్తూ ఉంటారు ఆటగాళ్ళు.  అందుకే ఒలంపిక్స్ మొదలయ్యే ముందు నుంచే ఒక అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఒలంపిక్స్లో అర్హత సాధించాలి అని భావిస్తూ ఉంటారు.



 అయితే గత ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్ కాస్త వాయిదా పడుతూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మెగా టోర్ని  జరుగుతుందా లేదా అన్న దానిపై కూడా  ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే కఠిన నిబంధనల మధ్య అన్ని రకాల క్రీడలు ప్రారంభం అయిన నేపథ్యంలో ఇక ఒలంపిక్స్ కూడా ప్రారంభం అవుతుంది అని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో అటు జపాన్ ప్రభుత్వం ఒలంపిక్స్  నిర్వహించేందుకు షెడ్యూలు కూడా విడుదల చేసింది.  మరికొన్ని రోజుల్లో ఒలంపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి అటు జపాన్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది.   వైరస్ వ్యాప్తి దృశ్య ఒలంపిక్ సమయంలో ఎమర్జెన్సీగా ప్రకటించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది.



 అంతేకాదు ఒలంపిక్స్ చరిత్రలోనే మొదటిసారిగా ప్రేక్షకులు లేకుండా ఒలంపిక్ మెగా టోర్నీకి జరగబోతుంది. అయితే మరికొన్ని రోజుల్లో జరగబోతున్న ఒలంపిక్ టోర్నీపై పాటు ప్రపంచవ్యాప్తంగా అంతగా ఆసక్తి చూపించడం లేదు అన్నది తెలుస్తుంది   ఆటగాళ్లు మాత్రమే కాదు ప్రేక్షకులు ఒలంపిక్స్ పై ఆసక్తి తో లేరట. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఒలంపిక్స్కు దూరంగా ఉంటామని పలువురు క్రీడాకారులు ప్రకటించారు. ఎంతోమంది అభిమానులు నిరాశ లోనే ఉన్నారట. ఇక ఒలింపిక్స్ ఫై అంతగా ఆసక్తి చూపడం లేదట. ఈ విషయం ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడయింది  జపాన్ లో నిర్వహిస్తున్న ఒలంపిక్ పై ప్రజలు కూడా ఆసక్తిగా లేనట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: