ఇప్పుడు వరకు పాకిస్థాన్ చేతిలో ఎప్పుడూ ఓడిపోయిన దాఖలాలు లేని టీమిండియా ఏకంగా కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. అయితే మొదటి మ్యాచ్లో టీమిండియా ఓడినప్పటికీ మళ్ళీ తప్పు సరిదిద్దుకుని రెండో మ్యాచ్లో రాణించి విజయం సాధిస్తుంది అని అనుకున్నారు అందరు. కానీ రెండో మ్యాచ్లో అంతకుమించి అనే రేంజ్ లోనే వైఫల్యాన్ని కొనసాగించింది. బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం అన్ని రకాలుగా విఫలం అయింది టీమిండియా దీంతో న్యూజిలాండ్ జట్టు టీమిండియా పై ఘన విజయాన్ని సాధించింది. వరుసగా రెండో ఓటమి చవి చూడడంతో టీమిండియాకు సెమీస్ అవకాశాలను దాదాపుగా మూసుకుపోయాయి.
ఇకపోతే టీమిండియా పేలవ ప్రదర్శన పై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎంతోమంది మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక టీమ్ ఇండియా న్యూజిలాండ్ జట్టుతో ఓటమి తర్వాత పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ టీమిండియాలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒక గ్రూప్ కెప్టెన్ కోహ్లి వైపు మొగ్గు చూపుతుంటే మరొక గ్రూప్ మాత్రం కోహ్లీకి వ్యతిరేకంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అతను మాత్రం ఒక గొప్ప క్రికెటర్ అంటూ అభివర్ణించాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి