టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా రెండు మ్యాచ్ లలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీమిండియా రన్రేట్ ఒక్కసారిగా పడిపోయింది. ఇక టీమిండియా సెమీ ఫైనల్కు చేరడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో మూడవ మ్యాచ్ నుంచి అద్భుతంగా పుంజుకున్న టీమిండియా ప్రత్యర్థికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం సాధించి భారీ తేడాతో విజయం సాధిస్తోంది. ఇక టీమిండియా సెమీస్ అవకాశాలను మరింత చేరువ చేసుకుంది .
అయితే టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కి వెళ్ళాలి అంటే అంతా న్యూజిలాండ్ ఆట పై ఆధారపడి ఉంది. ఎందుకంటే నేడు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడితేనే భారత్ సెమీఫైనల్కు చేరుకుంటుంది. ఇకపోతే ఇటీవలే రవీంద్ర జడేజాను మీడియా ప్రతినిధి ఇదే విషయం పై ప్రశ్న అడగనా ఆసక్తికర సమాధానం చెప్పాడు ఈ సీనియర్ ఆల్ రౌండర్. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై న్యూజిలాండ్ గెలిస్తే ఎలా అంటూ ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. ఇంకేముంది బ్యాగ్ లు సర్దుకుని ఇంటికి వెళ్లిపోవడమే అంటూ సమాధానమిచ్చాడు రవీంద్ర జడేజా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి