ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లాండ్ తో 2021 - 22 యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా మొత్తం 5 టెస్ట్ లు జరుగుతాయి. ఈ యాషెస్ ను ఈ రెండు జట్లు చాలా ప్రధానమైనదిగా చూస్తారు. అందుకే వీరిద్దరి మధ్య హోరా హోరీగా ఈ సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే మూడు టెస్ట్ లు ముగిశాయి. అయితే మూడు టెస్ట్ లలోనూ ఆస్ట్రేలియాకు ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేక ఇంగ్లాండ్ ఓటమి పాలయింది. అయితే ఇక మిగిలి ఉన్న రెండు టెస్ట్ లలో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తున్న రూట్ సేనకు నాలుగవ టెస్ట్ కు ముందు భారీ షాక్ తగిలింది.

ఇప్పుడిప్పుడే ఇంగ్లాండ్ జట్టులో అత్యుత్తమ బౌలర్ గా ఎదుగుతున్న ఓలీ రాబిన్సన్ గాయం కారణంగా రేపు సిడ్నీ లో జరిగే టెస్ట్ కు దూరమయ్యాడు. నెట్ ప్రాక్టీస్ లో భుజం గాయం పడడంతో తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ గ్రాహం థోర్ప్ తెలిపాడు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఓలీ రాబిన్సన్ 9 వికెట్లు సాధించాడు. ఇక ఇతని స్థానంలో సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు యాజమాన్యం తెలిపింది. బ్రాడ్ కూడా ఇటీవలి కాలంలో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ సైతం వరుస ఓటములను తట్టుకోలేక చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కు ఒక విజయం ఖచ్చితంగా అవసరం. ఇక మరో వైపు వరుస విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియా ఎలాగైనా ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. గత మ్యాచ్ లో ఆడించిన జట్టు తోనే బరి లోకి దిగే అవకాశం ఉంది. మరి చూద్దాం ఆస్ట్రేలియా జోరుకు ఇంగ్లాండ్ అడ్డు కట్ట వేస్తుందా?  


మరింత సమాచారం తెలుసుకోండి: