ప్రస్తుతం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఈ టూర్ లో ఇండియా సఫారీ టీమ్ తో మూడు టెస్ట్ లు మరియు మూడు వన్ డే లను ఆడనుంది. కాగా ఇప్పటికే రెండు టెస్ట్ లు పూర్తి అయిన విషయం తెలిసిందే. అందులో మొదటి టెస్ట్ ఇండియా మరియు రెండవ టెస్ట్ సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది. రెండవ టెస్ట్ కూడా ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ బ్యాటింగ్ వైఫల్యంతో ఇండియా తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. దీనితో సిరీస్ లో విన్నర్ ఎవరి తెలియాలంటే మూడవ టెస్ట్ వరకు ఆగాల్సిందే. రేపటి నుండి కేప్ టౌన్ వేదికగా మూడవ టెస్ట్ స్టార్ట్ కానుంది. ఇందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జట్టునే విజయం వరించనుంది.

కాగా రేపు సమరానికి ముందు ఇండియాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కనిపిస్తున్నది యువ వికెట్ కీపర్ మరియు సంచలన బాట్స్మన్ రిషబ్ పంత్ యొక్క ఫామ్ లేమి, గత కొన్ని టెస్ట్ లుగా రిషబ్ పంత్ ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. పైగా వికెట్ కీపింగ్ లోనూ కీలక సమయంలో క్యాచ్ లు జారవిడుస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న సౌత్ ఆఫ్రికా సిరీస్ లోనూ వరుసగా నాలుగు ఇన్నింగ్స్ లోనూ కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీనితో మళ్ళీ యధావిధిగా విమర్శలు మొదలయ్యాయి.

బీసీసీఐ కూడా పంత్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపు జరగబోయే మ్యాచ్ లో సరిగా ఆడకపోతే మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు టెస్ట్ లు ఆడడం కష్టమేనని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే రిషబ్ పంత్ తన బ్యాటింగ్ లో ఏర్పడిన లోపాలను సరి చేసుకుని మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.  



 

మరింత సమాచారం తెలుసుకోండి: