సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు ఘోర ఓటమి చవిచూసింది. ఒక్కసారి కూడా సౌత్ఆఫ్రికా పర్యటనలో భారత జట్టు క్లీన్ స్వీప్ కాలేదు. మొదటిసారి వన్డే సిరీస్లో మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేక పోయింది టీం ఇండియా.  వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడి పోయి క్లీన్ స్వీప్   అయ్యింది. దీంతో టీమిండియా చెత్త రికార్డునూ ఖాతాలో వేసుకుంది అనే చెప్పాలి. అంతకుముందు టెస్టు సిరీస్లో కూడా టీమిండియా ఓటమి పాలయింది అన్న విషయం తెలిసిందే..  తర్వాత వన్డే సిరీస్లో అయినా రాణిస్తుంది అని అనుకున్నప్పటికీ చివరికి మళ్లీ ఓటమి తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా గెలుస్తుంది అని అనుకున్నప్పటికీ నాలుగు పరుగుల తేడాతో చివరికి మ్యాచ్ చేజార్చుకున్న టీమ్ ఇండియా. దీంతో ప్రస్తుతం టీమిండియా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణంగానే టీమ్ ఇండియా ఓటమి చవిచూసింది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటమితో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. మూలుగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది టీమిండియా పరిస్థితి. ఇటీవలే స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో ఏకంగా 40 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. మూడో వన్డే మ్యాచ్లో నిర్దేశించిన  సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ ఓవర్లు వేసిన కారణంగా టీమిండియాకు ఇలా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే టెస్టు సిరీస్ వన్డే సిరీస్ ఓడిపోయి నిరాశలో ఉన్న టీమిండియాకు ఇక ఇప్పుడు మ్యాచ్ ఫీజులో కోత కూడా మరింత నిరాశ మిగిల్చింది అని చెప్పాలి. ఏదేమైనా ఇటీవలికాలంలో  ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియా అటు సౌతాఫ్రికా లో మాత్రం వరుసగా పరాజయం పాలుకావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: