ప్రస్తుతం అండర్ 19 జట్టులో ఆడుతున్న ఆటగాళ్లను చూస్తుంటే రానున్న రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఎంత అద్భుతం గా రాణించ బోతుందో ఊహకందని విధం గానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అండర్-19 కుర్రాళ్లు అంతలా అదర గొడుతున్నారు. ముఖ్యం గా కెప్టెన్ యష్ దుల్ జట్టును ముందుకు నడిపిస్తున్న తీరు అందరిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది అని చెప్పాలి. వరల్డ్ కప్ లాంటి అంతర్జాతీయ టోర్నీల్లో ఎక్కడ తడబడకుండా టీమిండియా జట్టు అద్భుత మైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ప్రస్తుతం వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ 19  ప్రపంచకప్లో టీం ఇండియా ఇరగ దీస్తుంది.


 మొన్నటికి మొన్న కరోనా వైరస్ బారినపడి జట్టుకు దూరమైన యష్ దుల్ వైరస్ భారీ నుంచి కోలుకుని మళ్లీ జట్టు లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఇక రావడం రావడమే సెంచరీతో చెలరేగి పోయాడు. ఇక ఎంతో కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా జట్టు పై 63 పరుగులకే తేడాతో మట్టి కరిపించింది. ఇక నేడు ఇంగ్లండ్తో ఫైనల్ మ్యాచ్ తల పడబోతుంది  టీమిండియా. ఇక కుర్రాళ్ల జట్టు ఎలా సత్తా చాట బోతుంది అన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 ఇటీవలే ఫైనల్ మ్యాచ్ కి ముందు మీడియా తో మాట్లాడిన అండర్ 19 టీమిండియా సారథి యష్ దుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కాసేపు మాట్లాడిన తర్వాత తనలో మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది అంటూ యష్ దుల్ చెప్పు కొచ్చాడు. కోహ్లీ మాటలు తనలో ఎంతగానో మానసిక స్థైర్యాన్ని పెంచాయని.. తుది పోరు లో ఎలాంటి ప్రణాళికలు రచించాలి ఎలా ఆడాలి అనేదానిపై కోహ్లీ కొన్ని సూచనలు ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. తాము ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తి కరంగా ఎదురు చూస్తున్నామని తెలిపాడు యష్ దుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: